OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. తెలుగులోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, కుంచకో బోబన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడం విశేషం.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. తెలుగులోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్
OTT Movie

Updated on: May 22, 2026 | 4:50 PM

ఇటీవల స్టార్ క్యాస్టింగ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ చిత్రం పేట్రియాట్. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత మలయాళ టాప్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఈ సినిమాలో నటించారు. వీరితో పాటు ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, కుంచకో బోబన్ తదితర స్టార్స్ కూడా ఈ మూవీలో భాగమయ్యారు. మహేశ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల అంచనాలను అందుకోలేనప్పటకీ బాక్సాఫీస్ వద్ద మంచి గానే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మల్టీ స్టారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పేట్రియాట్ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 05 నుంచి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు జీ5 సంస్థ అధికారికంగా వెల్లడించింది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ పేట్రియాట్ సినిమా అందుబాటులోకి రానుంది.

ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజీవ్ మేనన్, ఇంద్రాన్స్, ప్రకాశ్ బేల్ వాడీ, గ్రేస్ ఆంటోనీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. అలాగే మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దేశభక్తి, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు వచ్చాయి. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా అద్దిరిపోయాయని రివ్యూు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

జీ5లో పేట్రియాట్ మూవీ స్ట్రీమింగ్..

తెలుగుతో సహా మొత్తం 5 భాషల్లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us