
మలయాళం మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. లవ్, కామెడీ, క్రైమ్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా ఏ జానర్ సినిమాలైనా మలయాళం అంటే చాలు తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో మలయాళం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమా గురించే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ మలయాళం సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 7.4 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ‘ 36 ఏళ్ల లతీన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు) అనే వ్యక్తి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. శర్మిల (నిఖిలా విమల్) అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కుట్టన్. అయితే, ఫస్ట్ నైట్‌కు రెడీ అవుతుండగా… కుట్టన్‌ను కొందరు ముసుగు ధరించిన దుండగులు దారుణంగా హత్య చేస్తారు. అయితే, ఊహించని విధంగా కుట్టన్ చనిపోయిన మరుసటి రోజు ఉదయం అతను పెళ్లి రోజున నిద్ర లేస్తాడు. ప్రతీ రోజూ రాత్రి ఇదే టైమ్ లూప్‌లో సేమ్ ఘటన జరుగుతుంటుంది. కుట్టన్ కూడా ప్రతీ రోజూ చనిపోతూ మళ్లీ తర్వాతి రోజు నిద్ర లేస్తాడు. మరీ దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి?
కుట్టన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? వీటిని చూసిన శర్మిల ఏం చేసింది? కుట్టన్ గతానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
మలయాళంలో రీసెంట్గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ధూమకేతు (Dhoomakethu). టైమ్ లూప్ సైన్స్ ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సజిన్ గోపు, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, గణపతి, షైన్ టామ్ చాకో, సిద్దార్థ్ భరతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీ మాడిసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ధూమకేతు ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ శుక్రవారం ( అక్టోబర్ 23) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి