
మలయాళ సినీ పరిశ్రమ అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది విభిన్నమైన సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలు. ఈ మధ్య కాలంలో ‘ధృడం’, ‘ఉయిర్’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అదే బాటలో ఇప్పుడు మరొక ఆసక్తికరమైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఉన్మాదం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ మలయాళ నటుడు కుంచకో బోబన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబరు 04 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ , హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం.
ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..
ఈ చిత్రంలో కుంచకో బోబన్ పోలీస్ అధికారి పాత్రలో నటించగా, ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటించారు. ఈ సినిమాకి కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. ‘జోసెఫ్’, ‘నాయట్టు’ వంటి సూపర్ హిట్ పోలీస్ థ్రిల్లర్ సినిమాలకు రచయితగా పనిచేసిన షాహీ కబీర్ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. సాధారణ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా కాకుండా, మానసిక సంఘర్షణల నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్‌గా దీనిని తీర్చిదిద్దారు.
ఎక్కువమంది చదివినవి : Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..
కథ విషయానికి వస్తే.. ఎప్పటికైనా ఒక గొప్ప సినిమా రైటర్ కావాలని కలలు కనే ఓ సాధారణ పోలీస్ అధికారి (కుంచకో బోబన్) అనుకోకుండా ఒక పాత ఆత్మహత్య కేసును మళ్లీ తెరిచి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అయితే ఇన్వెస్టిగేషన్ లోతుగా చేసే కొద్దీ, అది సాధారణ ఆత్మహత్య కాదని.. దాని వెనుక ఒక ప్రమాదకరమైన సైకోపాత్ హస్తం ఉందని అతనికి అర్థమవుతుంది. ఆ మిస్టరీని చేధించే క్రమంలో అతనికి ఎదురయ్యే నిజాలు అతడిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కేసు క్లైమాక్స్‌కి వచ్చేసరికి, బయట ఉన్న శత్రువుల కంటే అతడి సొంత ఆలోచనలు, భ్రమలే అతనికి అతిపెద్ద శత్రువుగా మారతాయి. ఒకవైపు ప్రాణాంతకమైన నేరస్థులు, మరోవైపు తనని మానసికంగా కుంగదీసే భ్రమల మధ్య నలిగిపోతూ సదరు పోలీస్ ఆఫీసర్ తనే ఒక ఉన్మాదిలా మారే పరిస్థితికి చేరుకుంటాడు. మరి ఆ కేసును అతడు ఎలా పరిష్కరించాడనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం. ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుంది.
ఎక్కువమంది చదివినవి : Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..