OTT Movies: థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్
సంక్రాంతి తర్వాత చాలా రోజులకు థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ
పలు ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలోసందడి చేసే సినిమాలేంటో చూద్దాం రండి.
చాలా రోజుల తర్వాత థియేటర్లలో స్టార్ హీరోల సినిమాల సందడి కనిపించనుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్-3. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా మే 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సూర్య నటించిన రెట్రో కూడా ఇదే తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవ్‌గణ్ రైడ్-2, సంజయ్‌దత్, సన్నీ సింగ్‌ల ‘భూతిని’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలేవీ స్ట్రీమింగ్ కు రావడం లేదు. అయితే ఇతర భాషలకు సంబంధించి మొత్తం ఒక 20 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.