
ఎప్పటిలాగే గత శుక్రవారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటే సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఓ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఆసక్తికరమైన కథ కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు మొత్తానికి ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ, ఒకే రాత్రిలో జరిగే కథతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు పోలీస్ అధికారులు తమ లాభం, స్వార్థం కోసం వ్యవస్థను ఎలా వాడుకున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. స్టోరీ విషయానికి వస్తే.. లంచాలు, అధికార దుర్వినియోగం, సెటిల్‌మెంట్లు వంటి దారుణాలకు పాల్పడే పోలీసులను ఒక అపరిచిత వ్యక్తి టార్గెట్ చేస్తాడు. మొదట్లో పోలీసులు ఇది సాధారణమే అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇదొక రివేంజ్ ప్లాన్ అని అర్థమవుతుంది. బయట భారీ వర్షం.. దీనికి తోడు స్టేషన్ లోపల కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతినడంతో పోలీసుల్లో భయం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరికి అనుమానం పెరుగుతుంది. చివరకు ప్రాణాలు దక్కించుకోవడానికి ఒకరినొకరు చంపుకొనే స్థితికి వస్తారు.
మరి పోలీసులపై పగ పెంచుకున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? చివరకు ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు శేష 2016. ఇదొక కన్నడ సినిమా. ప్రదీప్ అర్సికెరే తెరకెక్కించిన ఈ సినిమాలో దేవరాజ్, ప్రమోద్ శెట్టి, జాన్ కైప్పల్లిల్, శ్రీజిత్ రవి, దినేష్ మంగళూరు, సిడ్లింగు శ్రీధర్, శోభరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం శేష 2016 సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం కన్నడ, మలయాళం భాషల్లోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడే చూడాలనుకునే వారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఆస్వాదించవచ్చు.
Helloooo ??
This changed everythingWatch Sesha 2016 exclusively on Sun NXT #Sesha2016 #SunNXT #Malayalam # Kannada
[Sesha 2016, Cop Story, Sun NXT Exclusive, Malalyam, Kannada, Police Thriller, Action Drama, May 22] pic.twitter.com/3wsecHmEPg
— SUN NXT (@sunnxt) May 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.