OTT Movie: కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్.. ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్

గత వారమే స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. మిస్టరీ, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తోంది. అందుకే కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్స్ కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును అందుకుంది.

OTT Movie: కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్.. ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Sep 30, 2026 | 4:07 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’, లవ్ సిరీస్, కార్తీ సర్దార్ 2, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఈ వారం ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. వీటి సంగతి పక్క న పెడితే.. ఓటీటీలో థ్రిల్లర్లకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఈ జానర్ సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. అలా థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఓ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును నమోదు చేసింది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కజిన్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, ఆ మిస్టరీని ఛేదించేందుకు మహాదేవి తన సొంత ఊరికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక పాడుబడ్డ అడవిలోకి, అలాగే ఒక రహస్య గుహలోకి ప్రవేశిస్తుంది.

ఆ గుహలో పన్నెండు చేతులున్న ఒక విగ్రహం మహాదేవికి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఒక దుష్టశక్తి ఆమెకు ఎదురవుతాయి. మరి ఆ దుష్టశక్తి బారి నుంచి తన కుటుంబాన్ని మహాదేవి ఎలా కాపాడుకుంది? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు అగధ. గతంలో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కించారు. పొలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల (మహాదేవి) ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసింది. అలాగే శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, భానుచందర్, వనితా విజయకుమార్, జోవికా విజయకుమార్, షిజూ, రోషన్ బషీర్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

జీ5లో అగధ సినిమా స్ట్రీమింగ్..

అగధ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us