OTT Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్ సినిమా

టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ సమయంలో వివాదం నెలకొంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ సినిమాను నిషేధించాలని కోరాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ కాంట్రవర్సీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్ సినిమా
OTT Movie

Updated on: Sep 30, 2026 | 8:41 PM

పెళ్లయి, ఓ బిడ్డకు తల్లిగా మారిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది కాజల్ అగర్వాల్. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అందులోనూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. అలా ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన మేసేజ్ ఓరియంటేడ్‌ మూవీ ‘ద ఇండియా స్టోరీ’. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే మరో కీలక పాత్రలో నటించాడు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. జులై 24 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజైంది. అది కూడా ఎన్నో వివాదాలు నడుమ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. దీనికి కారణం ఈ సినిమా స్టోరీనే. భారతీయ వ్యవసాయ విధానం, అందులోనూ పెస్టిసైడ్ వ్యవసాయం వల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే తీవ్ర ప్రతికూల ప్రభావాలను ప్రధానాంశాలుగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో సహజంగానే ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఈ సినిమా రిలీజ్ చేయవద్దని డిమాండ్ చేసినట్లు తెలిసింది. మొత్తానికి ఎలాగోలా అన్ని సమస్యలను అధిగమించి థియేటర్లలో రిలీజైన ఈ సినిమా జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

కాగా ద ఇండియా స్టోరీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 18 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఇవాళ్టి నుంచి తెలుగు తో పాటు తమిళం వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై న్యాయ పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే ది ఇండియా సినిమా స్టోరీ. కాజల్ ఇందులో లాయర్ గా నటించింది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో కాజల్ అగర్వాల్ కొత్త సినిమా..

 ది ఇండియా స్టోరీ సినిమా ట్రైలర్..

Loading...
Unable to load recommendations.
Follow Us