ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. IMDbలో 7.7/10 రేటింగ్..! ఎక్కడ చూడొచ్చంటే

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సినిమాలు నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. బడా సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకుంటూ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. IMDbలో 7.7/10 రేటింగ్..! ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie

Updated on: Aug 04, 2026 | 11:18 AM

ఓటీటీలో ట్రెండ్ అయ్యే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇప్పటికే రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఓటీటీల పుణ్యమా అని చాలా రకాల జోనర్స్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో పాటు రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలు చాలా మంది కుర్రకారు రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.

ఇది కూడా చదివేసేయండి :ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ఈ సినిమా సింగిల్ సింతకాయలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక బోల్డ్ మూవీ.. ఈ సినిమాలో మొత్తం ఆ సీన్సే.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా మొత్తం ఓ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరి జీవితం చిన్న చిన్న గొడవలతో సాగుతూ ఉంటుంది. అంతా బాగుంది అనుకునేలోగా ఆమె మిస్ అవుతుంది. ఆమెకోసం చాలా వెతుకుతాడు. ఇక ఆమె తిరిగి రాదు అనుకుంటాడు కానీ అప్పడే అసలు కథ మొదలవుతుంది. భార్య మిస్ అవ్వడం వెనక కారణం ఏంటా అని వెతకడం మొదలు పెడతాడు.

ఇది కూడా చదివేసేయండి :Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు

అక్కడి నుంచి ఊహించని సీన్స్, ట్విస్ట్ లు మొదలవుతాయి. సీన్ సీన్ కు షాక్ లు మీద షాకులు తగులుతాయి. అతని భార్య మిస్సింగ్ వెనక ఒక సీక్రెట్ ప్లాట్ ఉంటుంది. అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయింది.? మరెవరితోనైనా ప్రేమలో పడిందా ? అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమా మన తెలుగు సినిమానే.. పేరు వైఫ్, ఐ. ఈ సినిమా  ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా IMDbలో 7.7/10 రేటింగ్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us