Bigg Boss Nonstop: మంచోళ్ళకు మంచితనం.. చెడ్డోళ్లకు చెడుగుడు.. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ నాన్ స్టాప్..

Bigg Boss Nonstop: ప్రతి వ్యక్తికి ఎదుటివారి జీవితంలో ఏమి జరుగుతుంది.. తెలుసుకోవాలనే ఆసక్తే... ఓ షోని సక్సెస్ చేస్తోంది. అదే బిగ్ బాస్ షో(Bigg Boss Show).. ఈ షో.. హాలీవుడ్ (Hollywood)నుంచి బాలీవుడ్(Bollywood) లోకి..

Bigg Boss Nonstop: మంచోళ్ళకు మంచితనం.. చెడ్డోళ్లకు చెడుగుడు.. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ నాన్ స్టాప్..
Bigg Boss Non Stop

Updated on: Feb 26, 2022 | 3:40 PM

Bigg Boss Nonstop: ప్రతి వ్యక్తికి ఎదుటివారి జీవితంలో ఏమి జరుగుతుంది.. తెలుసుకోవాలనే ఆసక్తే… ఓ షోని సక్సెస్ చేస్తోంది. అదే బిగ్ బాస్ షో(Bigg Boss Show).. ఈ షో.. హాలీవుడ్ (Hollywood)నుంచి బాలీవుడ్(Bollywood) లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టింది. బుల్లి తెర -ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మళ్ళీ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి ఈరోజు సాయంత్రం రానుంది.  ఆరు సీజన్లు ముగించుకున్న బిగ్ బాస్ షో.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుంది.  బిగ్ బాస్ నాన్ స్టాప్ గా రానున్న ఈ  షో కు కింగ్ నాగార్జున హోస్ట్ గా అలరించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ గా స్టార్ మా ఒక టీజర్ ను లాంచ్ చేసింది.  ఇప్పటికే . నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో ఈ రోజు సాయంత్రం (ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటలకు  ప్రారంభం కానున్నది. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

నిజానికి సీజన్ 3 కి సీజన్ 4 కి మధ్య కరోనా కారణంతో చాలా గ్యాప్ వచ్చింది.. కానీ ఈసారి అంత గ్యాప్ లేకుండా వెంట వెంటనే బిగ్ బాస్ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. మళ్ళీ నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. 17 మంది కంటిస్టెంట్లు, 84 రోజుల పాటు నాన్ స్టాప్ గా బుల్లి తెర ప్రేక్షకులకు అందించడానికి రంగం సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి డిస్ని హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరించనుంది ఈ షో.

బిగ్ బాస్ హౌస్ ఇంద్ర ధనస్సులా కలర్ ఫుల్ గా ఉంది.. బిగ్ బాస్ హోస్టింగ్ ఇక్కడ నుంచే చేస్తే బాగుంటుంది.. అంటే.. ఇది నా అడ్డా.. అంటూ ఒకొక్క కంటెస్టెంట్ తో మాట్లాడుతూ.. చివరికి మంచోళ్ళకు మంచితనం.. చెడ్డోళ్లకు చెడుగుడు  చెడుగుడు..  డిష్యూం,  డిష్యూం .. మీ ఫ్యాన్స్ వెయింట్ ఇక్కడ అంటూ ప్రోమోలో కంటెస్టెంట్ తో నాగ్ సందడి చేశారు.

 

Also Read:

హెలికాఫ్టర్ల ప్రమాదానికి కారణాలు.. ఇప్పటి వరకూ దేశంలో మరణించిన ప్రముఖుల వివరాలు..

వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. యూనియన్ బ్యాంకు నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు

వయసు తో పాటు పెరుగుతున్న అందం.. శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోస్

 

Loading...
Unable to load recommendations.
Follow Us