
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో రాబోతున్న ఈ షోలో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇంకేముందు బాలయ్య హోస్ట్‌గా ఓ టాక్ షో రాబోతుందన్న ప్రకటన రాగానే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో.. నెట్టింట్లో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ టాక్ షో చేయడం ఒకటైతే.. ఈ షోకు వచ్చే గెస్ట్ ఎవరనేది తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమోతో.. మొదటి గెస్ట్స్ ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. బాలయ్య షో మొదటి అతిథులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ వస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్..
ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమో.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో మోహన్ బాబు.. బాలకృష్ణ మధ్య ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు నడిచినట్లుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. మంచు లక్ష్మి, విష్ణుతో కలిసి సందడి చేశారు బాలయ్య.. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులను ఎదురుచూస్తున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ విత్ NBK మొదటి ఎపిసోడ్ రేపు (నవంబర్ 4న) ఉదయం 11.20 నిమిషాలకు స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మంచు ఫ్యామిలీతో నందమూరి నటసింహం చేసే సరదా అల్లరిని రేపు ఆహాలో చూసేయ్యోచ్చు.. దీపావళిగా కానుకగా ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించనున్నారు బాలయ్య.
Also Read: Vijay Setupati: ఎయిర్‌పోర్ట్‌లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..
Taapsee: ఆ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..
Bheemla Nayak: దీపావళి ముందే వచ్చేసింది.. లాలా భీమ్లా సాంగ్ ప్రోమో అదుర్స్ అంతే…