The Village OTT: దడ పుట్టించే వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఆర్య ‘ది విలేజ్‌’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Nov 24, 2023 | 6:05 PM

గత నెలలో వచ్చిన అతిథి, మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్‌ హీరో ఆర్య నటించిన ది విలేజ్‌. టీజర్‌, ట్రైలర్‌తోనే ఆడియెన్స్‌ను భయపెట్టేసిన ఈ సిరీస్‌ శుక్రవారం (నవంబర్‌ 24) అర్ధరాత్రి నుంచే డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది

The Village OTT: దడ పుట్టించే వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఆర్య ది విలేజ్‌ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
The Village Web Series
Follow us on

ప్రస్తుతం ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హార్రర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సిరీస్‌లకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది. గత నెలలో వచ్చిన అతిథి, మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్‌ హీరో ఆర్య నటించిన ది విలేజ్‌. టీజర్‌, ట్రైలర్‌తోనే ఆడియెన్స్‌ను భయపెట్టేసిన ఈ సిరీస్‌ శుక్రవారం (నవంబర్‌ 24) అర్ధరాత్రి నుంచే డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ది విలేజ్ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆర్య వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా డైరెక్టర్‌ మిళింద్‌ రావు ది విలేజ్‌ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. బీఎస్ రాధాకృష్ణన్ స్టూడియో శక్తి బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించాడు. ఇందులో ఆర్య సరసన దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. ఆడుకులం నరేన్, ఆజియా, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, తలైవాసల్ విజయ్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్, పి.ఎన్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

కథేంటంటే..

ది విలేజ్‌ కథ విషయానికి వస్తే.. హీరో ఆర్యతో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అడవి మధ్యలో పాడైపోతుంది. సాయం కోసం పక్కనే ఉన్న ఒక ఊళ్లోకి వెళతారు. అయితే అక్కడ కొందరు వింత మనుషులు వారికి తారస పడతారు. కొన్నిఅతింద్రీయ శక్తులు హీరో భార్య పిల్లలను అపహరిస్తారు. మరి వారి నుంచి హీరో తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకున్నాడు? అసలు వింత మనుషులెవరు? వారెందుకు అక్కడున్నారో తెలుసుకోవాలంటే ది విలేజ్ వెబ్‌ సిరీస్‌ కచ్చితంగా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ది విలేజ్ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..