OTT Movie: అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. ఓటీటీలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఓటీటీలో మంచి ట్విస్టులున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ తెలుగు సైకో కిల్లర్ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో ఒక సైకో కిల్లర్ ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్ లో తిరుగుతూ అమ్మాయిలను దారుణంగా హతమారుస్తుంటాడు.

OTT Movie: అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. ఓటీటీలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
OTT Movie

Updated on: May 22, 2026 | 7:23 PM

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలకు చెందిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ జానర్ లో రోడ్ సైడ్ థ్రిల్లర్ మూవీస్ కు కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. హైదరాబాద్ నగరంలో ఓ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను దారుణంగా హతమారుస్తుంటాడు. దీంతో పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ను నియమిస్తారు. ఆమె తన దైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ కిల్లర్‌ను పట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తుంది. సిటీలోనూ, ఔట్ స్కర్ట్స్ లోనూ ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయిస్తుంది. కానీ ఆ సైకో కిల్లర్ తెలివిగా అంబులెన్స్ లో తిరుగుతూ పోలీసులను బోల్తా కొట్టిస్తుంటాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతున్నాడు? చివరికి ఆ క్రిమినల్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నదే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికరంగా ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు హైవే. రైటర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి. గుహన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, అభిషేక్ బెనర్జీ, రమ్య పసుపులేటి, సత్య, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించాడు. ఇందులో అమ్మాయిలను మానసికంగా హింసించి దారుణంగా చంపేసే సైకో కిల్లర్ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బెనర్జీ అద్బుతంగా నటించాడు. సినిమా మరీ సూపర్బ్ గా ఉందని చెప్పలేం కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి ఈ హైవే మూవీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

 

ఆహా ఓటీటీలో హైవే సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us