
అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. గతంలో సుమంత్‌తోనే ‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి డివోషనల్ థ్రిల్లర్ తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడినే ఈ సినిమాను రూపొందించాడు. అక్కినేని హీరోతో పాటు సిద్ధు జొన్నలగడ్డ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. వారాహి అమ్మవారి మహత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఉన్నంతలో నిర్మాతలకు కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఐఎమ్ డీబీలోనూ మహేంద్ర గిరి వారాహి సినిమాకు మంచి రేటింగ్ దక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మహేంద్ర గిరి వారాహి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (అక్టోబర్ 02) నుంచే సుమంత్ సినిమాను స్ట్రీమింగ్ కు రానుంది. అంటే థియేటర్లలో విడుదలైన 21 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ మహేంద్ర గిరి వారాహి సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా మహేంద్రగిరి వారాహి సినిమాను నిర్మించాయి. హీరో, హీరోయిన్లతో పాటు మాళవిక నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మహేంద్ర గిరి వారాహి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక రాజవంశాన్ని ఏళ్లుగా ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. ఆ కుటుంబంలోని మగవాళ్లు 33 ఏళ్లు దాటగానే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంటారు. అసలు ఈ శాపం ఎందుకు వచ్చింది? దాని వెనుక మహేంద్రగిరి వారాహి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? అదే వంశానికి చెందిన సుమంత్ ఈ మిస్టరీని ఎలా కనుగొన్నాడన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మరి థియేటర్లలో మహేంద్రగిరి వారాహి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
📢 Streaming Announcement @iSumanth‘s #MahendragiriVarahi (Telugu)
Streaming from Tonight on PrimeVideo in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/Ry9Q0jxnOr
— OTT Trackers (@OTT_Trackers) October 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.