AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?

నటుడు అరవింద్ తన రెండు దశాబ్దాల సినీ ప్రస్థానం, వందకు పైగా చిత్రాలు, మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, తంబ్ నెయిల్స్ వల్ల ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తన కెరీర్‌కు మద్దతునిచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?
Actor Aravind
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2026 | 7:09 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న అరవింద్, తన సినీ ప్రయాణం, మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలు, పరిశ్రమలోని అనుభవాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2005లో తన మొదటి చిత్రం నుంచి ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించినప్పటికీ, తాను మీడియాకు దూరంగా ఉంటానని, కేవలం 2018లో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానని ఆయన వెల్లడించారు. మీడియాకు దూరంగా ఉండటానికి గల ప్రధాన కారణాలను వివరిస్తూ, సోషల్ మీడియాలో తంబ్ నెయిల్స్, కామెంట్స్ వల్ల ఎదురైన చేదు అనుభవాలను అరవింద్ పంచుకున్నారు. విరూపాక్ష సినిమాలో తన తండ్రి పాత్రను పోషించిన నటుడు జనార్ధన్ విషయంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్పారు. జనార్ధన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు, “పాపం పెద్ది స్టోరీ లీక్ చేసిన పలాసా జనార్ధన్” అనే తంబ్ నెయిల్ పెట్టి, ఆయనను ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అనవసర కామెంట్లు మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కులం పేరుతో విమర్శలు చేయడాన్ని కూడా అరవింద్ ఖండించారు. చిత్ర పరిశ్రమలో కుల వివక్ష అనేది అస్సలు లేదని, ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తన కెరీర్‌కు అండగా నిలిచిన దర్శకులను అరవింద్ కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తన జీవితాన్ని మార్చేశారని, ముఖ్యంగా అశోక్ సినిమాలోని అవకాశం తన కెరీర్‌కు కీలక మలుపు అని అన్నారు. ఆ ఒక్క రోజు తన జీవితం మారకుంటే ఈరోజు తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని భావోద్వేగంగా చెప్పారు. సురేందర్ రెడ్డికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే, కోడి రామకృష్ణతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని, వారి కుటుంబ కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొంటానని తెలిపారు. పూరి జగన్నాథ్ తన గ్యాంగ్ సినిమాలో విలన్ సోదరుడి పాత్రను ఇచ్చి అవకాశం కల్పించారని, అది రవితేజ, ముమైత్ ఖాన్ వంటివారితో కలిసి నటించే అవకాశం అని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తనను తొలిసారి విదేశాలకు (మలేషియా) షూటింగ్ నిమిత్తం తీసుకెళ్లారని, ఆ అనుభవం మర్చిపోలేనిదని వివరించారు. ప్రేక్షకులు తమ అభిమాన నటుల వ్యక్తిగత జీవితం, కష్టాలు, ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారని, అది సహజమేనని అరవింద్ అంగీకరించారు. “ఈ రోజుల్లో ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలి” అనే నానుడిని ప్రస్తావిస్తూ, తన గురించి తాను చెప్పకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. సోషల్ మీడియాలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, తన సినీ ప్రస్థానం గురించి బహిరంగంగా పంచుకోవడం ద్వారా అభిమానులకు మరింత చేరువ కావాలని ఆయన ఆశిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది.

కాగా తన సోదరుడు ఇంద్రనీల్‌ కూడా ఇండస్ట్రీలో మంచి నటుడని తెలిపారు. బుల్లితెరపై స్టార్‌గా వెలిగొందుతున్నాడని.. తనకంటే ముందే ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయినట్లు వివరించారు. మ్యారేజ్ అయ్యాక తనతో ఎక్కువ బాండింగ్ ఉండదని.. ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వచ్చి వెళతాడని వివరించాడు.

Indraneil With His Wife

Indraneil With His Wife

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర