Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాలు వెంటనే అటు ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా ఓ మూవీ సైతం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ..? కథేంటీ ? తెలుసుకుందామా.

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..
With Love

Updated on: Mar 01, 2026 | 3:09 PM

దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఆయన తెరకెక్కించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న అభిషన్.. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యాడు. అతడు హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ విత్ లవ్. ఈచిత్రంతోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ఇందులో అభిషన్, అనస్వర కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈనెల 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను రజినీకాంత్ కూతురు సౌందర్య నిర్మించారు. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సత్య (అభిషన్) చుట్టూ తిరుగుతుంది. అతడు ఒక వాస్తుశిల్పి. కుటుంబసభ్యులు అతడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అయితే ఆ అమ్మాయిల్లో సత్యకు ఎవరూ నచ్చరు. తీవ్ర ఒత్తిడి తీసుకురాగా ఎట్టకేలకు మోనీషా (అనస్వర)ను కలిసేందుకు వెళ్తాడు. తర్వాత ఆమెతో మాట్లాడతాడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నామని తెలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో ఇద్దరు ఒక అబ్బాయిని, అమ్మాయిని మీట్ కావాలనుకుంటారు. అసలు వీరిద్దరి మధ్య అనుబంధం ఏంటీ.. ? చివరకు వీరిద్దరు ఒక్కటయ్యారా ? అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us