Nithin Maestro: విడుదలకు సిద్ధమైన నితిన్ మాస్ట్రో.. అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక.

|

Sep 14, 2021 | 7:17 PM

Nithin Maestro: నితిన్‌ హీరోగా నభా నటేశ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం 'మాస్ట్రో'. హిందీలో సెన్సేషన్‌ విజయాన్ని అందుకున్న 'అందాధున్‌' చిత్రానికి రీమేక్‌గా...

Nithin Maestro: విడుదలకు సిద్ధమైన నితిన్ మాస్ట్రో.. అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక.
Follow us on

Nithin Maestro: నితిన్‌ హీరోగా నభా నటేశ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో సెన్సేషన్‌ విజయాన్ని అందుకున్న ‘అందాధున్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్‌ చివరి క్షణం వరకు ప్రయత్నించారు కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 17న ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌ స్టార్‌లో విడుదల చేయనున్నారు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రలో నభా నటేష్‌ నటిస్తుండగా, టబు పోషించిన పాత్రలో తమన్నా నటిస్తోంది.

ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సినిమా ట్రైలర్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. హిందీలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాపై తెలుగులోనూ ఆసక్తి నెలకొంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో మూవీ యూనిట్‌ ప్రచార వేగాన్ని పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక లైవ్‌ను ఇక్కడ చూడండి..

Also Read: Weather Report: కేంద్రీకృతంగా వాయుగుండం.. రాగల మూడు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు

Black Rice Benefits: ఏపీలో పెరుగుతున్న కొత్త వంగడాల సాగు.. బ్లాక్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు..!

South Central Railway: పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. స్పెషల్‌ ట్రైన్స్‌ను పొడగిస్తూ..