Netflix: బన్నీకి విషెస్‌ చెప్పిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌.. ఎందుకో తెలుసా.?

|

Apr 30, 2022 | 4:47 PM

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఓటీటీ (OTT) సంస్థ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ ఓటీటీ సేవలు ప్రపంచమంతా విస్తరించాయి. తెలుగులోనూ ఒరిజినల్స్‌..

Netflix: బన్నీకి విషెస్‌ చెప్పిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌.. ఎందుకో తెలుసా.?
Allu Arjun
Follow us on

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఓటీటీ (OTT) సంస్థ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ ఓటీటీ సేవలు ప్రపంచమంతా విస్తరించాయి. తెలుగులోనూ ఒరిజినల్స్‌ తెరకెక్కిస్తున్నారంటేనే నెట్‌ఫ్లిక్స్‌ మార్కెట్ విస్తరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని భాషల్లో విస్తరిస్తోంది కాబట్టే దీనికి ఇంతటి క్రేజ్‌ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఓటీటీ సంస్థ తాజాగా అల్లు అర్జున్‌తో పాటు, మరో ముగ్గురికి ప్రత్యేకంగా విషెస్‌ చెప్పింది. ఇంతకీ నెట్‌ఫ్లిక్స్‌ ఎందుకు విషెస్‌ చెప్పిందనేగా మీ సందేహం..

ఏప్రిల్‌ 29 ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెట్‌ఫ్లిక్స్‌ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘అందరికీ ఇంటర్నేషనల్ డ్యాన్స్‌ డే శుభాకాంక్షలు. కానీ వీరికి మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు’ అని నలుగురి ఫొటోలను పోస్ట్‌ చేశారు. వీరిలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు కాగా మిగతా ముగ్గురిలో.. బాలీవుడ్​ సీనియర్ నటీమణి మాధురి దీక్షిత్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హృతిక్ రోషన్ ఫొటోలు ఉన్నాయి. వీరంతా వారి వారి ఇండస్ట్రీల్లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌గా పేరుగాంచిన విషయం తెలిసిందే.

బన్నీ క్రేజ్‌కు అతని స్టైలిష్‌ యాక్టింగ్‌ ఒక కారణమైతే, డ్యాన్స్‌ మరొక కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీతో డ్యాన్స్‌ చేయాలంటే తోటీ నటీమణులు కూడా కష్టమని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బన్నీ డ్యాన్స్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది కాబట్టే నెట్‌ఫ్లిక్స్‌ డ్యాన్స్‌ డే రోజు ప్రత్యేకంగా శుభాకాక్షలు తెలిపింది. ఇది చూసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: GT vs RCB Live Score, IPL 2022: చెలరేగుతోన్న విరాట్‌ కోహ్లీ.. వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీకి చేరువలో..

Health Tips: షుగర్‌ పేషెంట్లకి గమనిక.. ఎండాకాలం వీటి విషయంలో జాగ్రత్త..!

CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ