Nagababu Praises  Sunitha: మీ ఆనందం, ప్రేమ శాశ్వత చిరునామాగా మారాలంటూ సునీతకు శుభాకాంక్షలు చెప్పిన మెగాబ్రదర్

ప్రముఖ సింగర్ సునీత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేని ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన కొత్త లైఫ్ సంతోషంగా ఉందని.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పింది సునీత. ఈ కొత్త జంటకు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్...

Nagababu Praises  Sunitha: మీ ఆనందం, ప్రేమ శాశ్వత చిరునామాగా మారాలంటూ సునీతకు శుభాకాంక్షలు చెప్పిన మెగాబ్రదర్
Follow us

|

Updated on: Jan 13, 2021 | 5:08 PM

Nagababu Praises  Sunitha: ప్రముఖ సింగర్ సునీత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేని ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన కొత్త లైఫ్ సంతోషంగా ఉందని.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పింది సునీత. ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వివాహ శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్‌ వేదికగా సునీత-రామ్‌లకు నాగబాబు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఎదిగిన పిల్లలున్న సునీత వారి ఎదురుగా పెళ్లి చేసుకోవడం ఏమిటి.. ఈ పెళ్లి తో సమాజానికి ఏమిమెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు మీ జంట అంటూ కత్తి మహేష్ వంటి వారు విమర్శలు చేస్తున్న తరుణంలో మెగా బ్రదర్ఈ ఈ జంటకు మద్దతుగా నిలిచారు.

Also Read: సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. హాజరైన రేణు దేశాయ్, అన్ని దగ్గరుండి చూసుకున్న నితిన్