Meenakshi Chaudhary: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌదరి

|

Feb 09, 2022 | 9:47 AM

అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.

Meenakshi Chaudhary: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  సినిమాలో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన  మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary
Follow us on

Meenakshi Chaudhary: అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి లో ఛాన్స్ కొట్టేసింది. ఖిలాడి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, టీజర్ , ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. అదే కానీ జరిగితే మీనాక్షి కి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం. ఈ సినిమాలో మీనాక్షి గ్లామర్ తో రెచ్చిపోయింది టాక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఏకంగా లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.

నా రెండవ సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు. ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన నేను కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ కంగారు పడొద్దంటూ రవితేజ గారు కంఫర్టును ఇచ్చారు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అలాగే లిప్ లాక్ గురించి ప్రశ్నించగా తనకు పెదవి ముద్దుల సన్నివేశాలతో ఇబ్బంది లేదని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తుంది. ఈ విషయం పై స్పందిస్తూ.. అయితే ఎలాంటి పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని మీనాక్షి చౌదరి స్పష్టం చేసింది. స‌లార్‌లో చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇంకా అది ఖ‌రారు కాలేదు. హిట్ 2 చేశాను. త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన `కొలై`లో న‌టించాను. అది త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది. మ‌రో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్