AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు: క్షమాపణలు కోరిన నిందితుడు

విజయ్ సేతుపతి కుమార్తెను అత్యాచారం చేయాలంటూ రిత్విక్ రాజ్‌ అనే ఓ నెటిజన్ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టిన విషయం తెలిసిందే

సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు: క్షమాపణలు కోరిన నిందితుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 2:54 PM

Share

Vijay Sethupathi Daughter: విజయ్ సేతుపతి కుమార్తెను అత్యాచారం చేయాలంటూ రిత్విక్ రాజ్‌ అనే ఓ నెటిజన్ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కామెంట్‌ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ సామాన్యులు మొదలు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అడ్రస్‌ని ట్రేస్‌ చేశారు. ప్రస్తుతం అతడు శ్రీలంకలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్‌ సహకారాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో రిత్విక్ ఓ వీడియోను విడుదల చేశాడు. అలాంటి కామెంట్లు చేయడం తన తప్పేనని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్‌లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.

కాగా శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ 800లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోగా.. అందులో నుంచి సేతుపతి తప్పుకోవాలంటూ కొంతమంది నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సేతుపతిని ఇబ్బంది పెట్టకూడదని భావించిన మురళీధరన్‌, తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలంటూ కోరారు. దీంతో 800 నుంచి విజయ్ తప్పుకున్నారు. అయినప్పటికీ కొంతమంది నిరసనలను ఆపలేదు. ఈ క్రమంలోనే అతడి కుమార్తెను అత్యాచారం చేస్తే గానీ విజయ్‌కి ఆ బాధ తెలీదంటూ రిత్విక్‌ సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టాడు.

Read More:

బీజేపీలో చేరిన ‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్‌

KGF 2: క్రూరత్వానికి అధినేత్రి.. రవీనా టాండెన్ లుక్ విడుదల

Follow Us
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..