Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..

ఇప్పుడు ఎక్కడ  చూసిన విజయ్ సేతుపతి పేరు మారు మ్రోగుతుంది. విజయ్ సేతుపతి కోసం అటు తమిళ, తెలుగు తో పాటు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పోటీపడుతోంది. చిన్న

Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..
Vijay Sethupathi

Updated on: Mar 22, 2021 | 12:14 PM

Vijay Sethupathi  : ఇప్పుడు ఎక్కడ  చూసిన విజయ్ సేతుపతి పేరు మారు మ్రోగుతుంది. విజయ్ సేతుపతి కోసం అటు తమిళ, తెలుగు తో పాటు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పోటీపడుతోంది. చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ హీరోలకు సరి సమానంగా నిలిచాడు. ఆయన కోసం దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు. తనదైన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు సేతుపతి. ఇటీవల ఆయన దళపతి విజయ్ కోసం విలన్ గా కూడా మారారు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది.

విజయ్ తో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు వెండితెరపైన అలరించిన మక్కల్ సెల్వన్ ఇప్పుడు బుల్లితెర పై సందడి చేయనున్నాడని తెలుస్తుంది. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ విజయ్ సేతుపతితో కలిసి ఒక టీవీ షోను ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక అన్ని ఇండస్ట్రీలో హీరోలు బుల్లితెరలపైన కూడా సందడి చేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ , మీలో ఎవరు కోటీశ్వరులు వంటి షోలతో స్టార్ హీరోలు బుల్లితెర పై సందడి చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా ఇలా టీవీషో లో కనిపించనున్నాడని తెలిసి అభిమానులంతా ఆనందంలో తేలిపోతున్నారు. అలాగే విజయ్ చేయబోతున్న టీవీ షో కుసంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vakeel Saab: పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో ఉంది.. రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు

Sarkaru Vaari Paata : మహేష్ కు తండ్రిగా మలయాళ నటుడు.. సర్కారు వారిపాట సినిమాలో జయ్ రామ్

Priyamani : జోరు పెంచిన యంగ్ టైగర్ హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీ

Loading...
Unable to load recommendations.
Follow Us