AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఆర్థిక కష్టాలు.. పండ్లు అమ్ముతున్న నటుడు..!

కరోనా మహమ్మారి రావడం వలన కోట్లాది మంది ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి వేతనంపై నెట్టుకొచ్చే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరందరితో పాటు కరోనా ప్రభావం సినిమా వాళ్లపై కూడా చాలా పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో […]

లాక్‌డౌన్ ఆర్థిక కష్టాలు.. పండ్లు అమ్ముతున్న నటుడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 10:49 PM

Share

కరోనా మహమ్మారి రావడం వలన కోట్లాది మంది ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి వేతనంపై నెట్టుకొచ్చే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరందరితో పాటు కరోనా ప్రభావం సినిమా వాళ్లపై కూడా చాలా పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆ మధ్యన ఓ సీరియల్ నటి తన వద్ద డబ్బులు లేకపోతే మేకప్ మ్యాన్ సహాయం చేశారంటూ సోషల్ మీడియాలో తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఓ నటుడు పండ్లు అమ్ముతున్నారు.

హిందీలో ‘తిత్లీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సోంచారియా’, ‘హల్కా’ వంటి చిత్రాల్లో నటించిన సోలంకి దివాకర్(35)‌కు కరోనా నేపథ్యంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పండ్ల వ్యాపారిగా మారిపోయారు. సినిమాల్లోకి వెళ్లకముందు కూడా ఆయన ఇదే వ్యాపారం చేస్తుండగా.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ”లాక్‌డౌన్‌ కొనసాగుతూ ఉండటంతో నా కుటుంబ పోషణ కష్టమవుతోంది. నేను ఇంటి రెంట్ కట్టాలి. అలాగే ఇంట్లో అందరినీ చూసుకోవాలి. అందుకే మళ్లీ నా పాత వృత్తిలోకి వచ్చేశా” అని తెలిపారు. కాగా రిషి కపూర్ పక్కన ఓ సినిమాలో సోలంకి ఆఫర్‌ రాగా.. ఆయన ఆకస్మిక మరణంతో ఇప్పుడు ఆ చిత్రం ఆగిపోయింది.

Read This Story Also: వివాదాస్పద ట్వీట్.. నాగబాబుపై కేసు నమోదు..!

Follow Us