AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: షూటింగ్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నిర్మాతలకు బంపరాఫర్..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు

Breaking: షూటింగ్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నిర్మాతలకు బంపరాఫర్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 19, 2020 | 10:40 PM

Share

ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా టీవీ, థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. గతంలో సంస్థ ఎండి ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో ms2 కు సవరణలు చేసింది.

నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. గతంలో నిర్ణయించిన ఫీజులను కషన్ డిపాజిట్లను కార్పొరేషన్‌కి చెల్లించి షూటింగ్ ముగిసిన తరువాత వాటిని రీఫండ్ చేయనుంది. సంస్థ ఎండి సూచనల మేరకు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్‌కి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మూడు కేటగిరీలను విభజించింది.

కేటగిరి 1′ ( రోజుకి కాషన్ డిపాజిట్ 15వేలు):

1.రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్‌కి అనుమతి.

2.పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కులలో షూటింగ్‌కి అనుమతి.

3.రాష్ట్రంలోని వివిధ మ్యూజియం, బిల్డింగ్‌లు, పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్‌కి అనుమతి.

కేటగిరి 2′ రోజుకి కాషన్ డిపాజిట్ 10వేలు:

1.రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్‌లకు అనుమతి.

కేటగిరి 3′  రోజుకి కాషన్ డిపాజిట్ 5వేలు:

1.మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు , బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్ తో సహా, అన్ని పార్కుల్లో షూటింగ్ అనుమతి.

2.ఏపీటిడిసి,ఆర్&బి, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్ లో షూటింగ్‌కి అనుమతి.

Read This Story Also: అమెరికాలో కోటి పందులు చంపేందుకు సిద్ధం.. ఎందుకంటే..!

Follow Us
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!