Actress : నాగార్జున, అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు.. 15 ఏళ్లు చిన్నవాడితో ప్రేమాయణం.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో తోపు హీరోయిన్. 5 సంవత్సరాల క్రితం తన ప్రియుడితో బ్రేకప్ జరిగింది. అయినప్పటికీ ఈ మాజీ ప్రేమికులు ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నారు. దాదాపు 15 ఏళ్ల చిన్నవాడితో ప్రేమాయణం జరిగింది. ఇప్పుడు ఆమె వయసు 50 సంవత్సరాలు. ప్రస్తుతం సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. ?

Actress : నాగార్జున, అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు.. 15 ఏళ్లు చిన్నవాడితో ప్రేమాయణం.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
Sushmitha Sen

Updated on: Aug 25, 2026 | 6:07 PM

తెలుగులో ఒకప్పుడు నాగార్జున సరసన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కన్నడ హీరో అర్జున్ జోడిగా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచింది. తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో ఆమమె ప్రేమాయణం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. ఒకప్పుడు రోహ్మాన్ షాల్ అనే యువకుడితో ఆమె డేటింగ్ సంచలనం సృష్టించింది. వారు డేటింగ్ ప్రారంభించినప్పుడు సుష్మిత వయసు 42 కాగా, రోహ్‌మన్ వయసు అప్పుడు 27 సంవత్సరాలు. 2018లో వారి సంబంధం బహిరంగం కావడానికి ముందు, వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. రోహ్మాన్ సుష్మిత కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యాడు. అతనికి తన కుమార్తెలు రెనీ , అలీసాలతో గొప్ప అనుబంధం ఉండేది. అతను తరచుగా కుటుంబ కార్యక్రమాలలో , విహారయాత్రలలో ఆ నటితో కలిసి కనిపించేవాడు. సుష్మిత తరచుగా వారి రొమాంటిక్ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకునేది.

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

దాదాపు మూడేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత, సుష్మితా సేన్ , రోహ్మాన్ షాల్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 2021లో, సుష్మిత వారి విడిపోవడాన్ని కన్ఫార్మ్ చేసింది. వారి ప్రేమ బంధం ముగిసినప్పటికీ, వారి మధ్య ఉన్న ప్రేమ , స్నేహం అలాగే నిలిచి ఉన్నాయని ఆమె చెప్పింది. అయితే, విడిపోయినంత మాత్రాన రోహ్మన్ సుష్మిత జీవితం నుండి వెళ్లిపోలేదు. వారు వివిధ సందర్భాలలో కలుసుకుంటూనే ఉన్నారు. వారిద్దరూ కలిసి కనిపించారు. విడిపోయిన తర్వాత కూడా, వారి స్నేహం త్వరలోనే చర్చనీయాంశంగా మారింది, వారు రహస్యంగా తిరిగి కలిశారా అని అభిమానులు పదేపదే ఆశ్చర్యపోయారు. సుష్మిత కష్టకాలంలో రోహ్మన్ కూడా ఆమెకు అండగా నిలిచాడు. 2023లో ఆమెకు గుండెపోటు వచ్చిన తర్వాత, అతను ఆమెకు తోడుగా ఉన్నాడు. వారిద్దరూ తమ కుమార్తె అలీసాతో కలిసి కనిపించారు, ఇది వారి సంబంధం ముగిసిన తర్వాత కూడా వారి బంధం కొనసాగుతోందని చూపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

2024 , 2025 వరకు వారు తరచుగా కలిసి కనిపించేవారు. వారు ఈవెంట్లలో , కుటుంబ ఫంక్షన్లలో కలిసి కనిపించేవారు. రోహ్మాన్ తరచుగా సుష్మితకు నిశ్శబ్దంగా మద్దతు ఇస్తూ కనిపించేవారు. 2025 మార్చిలో, అతను నిరంతరం వస్తున్న ఊహాగానాలను ఖండించాడు. ఇదిలా ఉంటే.. సుష్మితా వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

సుష్మితా సేన్..

Sushmitha Sen, Rohman

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

Loading...
Unable to load recommendations.
Follow Us