Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న మాధురి రాథోడ్ పాట.. నెట్టింట దుమ్ముదుమారం..

ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయి. ఇక నెట్టింట తెలంగాణ జానపదాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ వివాదం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ కగా.. వీరిద్దరు కలిసి నటించిన పాటలు మాత్రం కోట్ల వ్యూస్ అందుకుంటూ సునామీ సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తుంది.

Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న మాధురి రాథోడ్ పాట.. నెట్టింట దుమ్ముదుమారం..
Folk Song

Updated on: Aug 25, 2026 | 8:43 PM

ఇటీవలి కాలంలో జానపద, తెలంగాణ యాసలో సాగే పాటలకు సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అనేక జానపద గీతాలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే వరుసలో తాజాగా విడుదలైన “మంజులో మాట్లాడిపోతా” (MANJULO MAATLADIPOTHA) పాట నెట్టింట విధ్వంసం సృష్టిస్తుంది. ఈ జానపద గేయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ శ్రోతలను ఊపేస్తోంది. ఈ పాటను ప్రముఖ గాయని శ్రీనిధి, సింగర్ నర్సింలు ఆలపించారు. ఎప్పటిలాగే స్పష్టమైన తెలంగాణ యాస ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వెంకట్ అజ్మీర, మాధురి రాథోడ్ కీలక పాత్రల్లో నటించగా, సంగీతం లిరిక్స్ జానపద శైలిని ప్రతిబింబించేలా ఎంతో ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్నాయి. పాట ఆరంభం నుంచే “ఏడేడు బంగుల అద్దల బంగుల.. బంగుల మీద చక్కని మంజులా.. మంజులో మాట్లాడిపోతా.. మంజులో ముద్దాడిపోతా అంటూ సాగే పల్లవి శ్రోతలను అలవోకగా పాడుకునేలా చేస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

గ్రామీణ నేపధ్యంలో నడిచే ప్రేమ, ముచ్చట్లు, ఆత్మీయ అనుబంధాలను ప్రతిబింబించేలా ఈ పాట సాహిత్యం మరియు శ్రావ్యమైన ట్యూన్ సాగుతాయి. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఈ పాట యూట్యూబ్‌లో 1.5 మిలియన్లకు పైగా (15 లక్షలకు పైగా) వ్యూస్ సంపాదించి తన సత్తా చాటుకుంది. అలాగే పదుల సంఖ్యలో నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ షార్ట్స్ , రీల్స్‌లో ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ద్వారా బాగా వైరల్ అవుతోంది. డ్యాన్స్ క్రియేటర్లు, రీల్స్ మేకర్స్ ఈ పాటకు స్టెప్పులేస్తూ కొత్త కొత్త వీడియోలు చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

తెలంగాణ నేటివిటీతో రూపుదిద్దుకున్న జానపద పాటలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మాధురి రాథోడ్ గాత్రంలో వచ్చిన ఈ “మంజులో మాట్లాడిపోతా” పాట శ్రోతల మనసులను గెలుచుకుంటూ, ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్‌లోని ప్లేలిస్ట్‌లో చోటు దక్కించుకుంది. జానపద సంగీత ప్రియులకు ఈ పాట ఒక చక్కటి అనుభూతిని అందిస్తోంది. ఈ పాటకు చిన్నా, పెద్ద స్టెప్పులేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

మంజులో మాట్లాడిపోతా సాంగ్..

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Loading...
Unable to load recommendations.
Follow Us