Karisma Daughter Samaira : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. సమైరా 16వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది. ఈ వేడుకల్లో కరీనా కపూర్ ఖాన్, తైమూర్, రణధీర్ కపూర్, బబితా కపూర్ తదితరులు పాల్గొనున్నారు.
గురువారం సాయంత్రం జరిగిన సమైరా పుట్టినరోజు వేడుకను కరిష్మా ఏర్పాటు చేశారు. తన కుటుంబ సభ్యుల మధ్య కుమార్తె కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వేడుకకి కరీనా కపూర్ ఖాన్ తన పెద్ద కొడుకు తైమూర్ తో కలిసి హజరయ్యారు.
కరిష్మా, కరీనా తల్లిదండ్రులు రణధీర్ కపూర్, బబితా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే కరీనా రెండవ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత రెండోసారి అందరికీ కనిపించడంతో అందరికీ ఆసక్తి నెలకొంది.
కరీనా తన అక్క కుమార్తె సమైరా పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో కరిష్మా తనయుడు కియాన్ కూడా ఉన్నాడు. ఆ ఫోటో పాటు మీరు మంచి స్థాయి కి చేరుకోవాలని .. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నన్ను తొలిసారిగా అమ్మతనంలో ని ప్రేమని తెలియజేసిన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని కామెంట్ కూడా జతచేసింది కరీనా.. సమయు నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది కరీనా
ఇక కరిష్మా కూడా తన కుమార్తె కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యువరాణిగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి నువ్వు ఎల్లప్పుడూ నీవు నాకు చిన్న యువరానివి .. నీకు 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పింది.
ఇక గత ఏడాది చుంకీ పాండే చిన్న కుమార్తె అనన్య పాండే దర్శకత్వంలో డాడ్ అనే లఘు చిత్రంలో ఒక పాత్రలో మెరిసింది సమైరా.. తొలిసారిగా నటించినా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ముంబైలోని మురికివాడలకు చెందిన ఒక యువతి కథే లఘు చిత్రం. ఓ యువతి ప్రొఫెషనల్ స్ప్రింటర్ కావాలని కలలు కంటూ అదినేరవేర్చుకోవడానికి పడిన కష్టమే డాడ్ లఘు చిత్రం.
Also Read: