Gabbar Singh Ramesh : గొప్ప మనసు చాటుకున్న కాంచన నటుడు.. గబ్బర్ సింగ్ రమేష్‏కు అండగా శ్రీమాన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రమేష్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా అలరించిన అతడు.. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రమేష్ కు అండగా నిలబడ్డారు కాంచన ఫేమ్ నటుడు శ్రీమాన్.

Gabbar Singh Ramesh : గొప్ప మనసు చాటుకున్న కాంచన నటుడు.. గబ్బర్ సింగ్ రమేష్‏కు అండగా శ్రీమాన్..
Gabbar Singh Ramesh, Sriman

Updated on: Sep 30, 2026 | 4:14 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే విలన్ల ‘అంత్యాక్షరి ఎపిసోడ్’ తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ ప్రత్యేక ఘట్టంలో తనదైన నటనతో అలరించి ‘గబ్బర్ సింగ్ రమేశ్’గా సినీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతుండటంతో ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులు వెల్లడించారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

కాగా, రమేశ్ ఆసుపత్రి పాలైన విషయ తెలుసుకున్న బహుభాషా నటుడు, ‘కాంచన’ ఫేమ్ శ్రీమాన్ వెంటనే స్పందించారు. తోటి కళాకారుడి కష్టాన్ని చూసి చలించిపోయిన ఆయన, రమేశ్ వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతుగా ₹25,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయం నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

తోటి నటుడు ఆపదలో ఉన్నాడని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సహాయం అందించిన శ్రీమాన్ పెద్ద మనసును ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులతో పాటు సినీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపద సమయంలో అండగా నిలిచినందుకు శ్రీమాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా రమేశ్ వైద్య ఖర్చుల నిమిత్తం పవన్ కల్యాణ్ ₹5 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి ₹3 లక్షలు, నాగబాబు ₹2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Loading...
Unable to load recommendations.
Follow Us