AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు అలా.. నేడు ఇలా.. జీవిత ‘డబుల్’ రోల్..!

నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఏదైనా పని ఒకరు చేస్తే ఒకలా.. అదే పని వేరే వాళ్లు చేస్తే ఇంకోలా మాట్లాడుతుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నటి జీవితా రాజశేఖర్‌పై కూడా ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇటీవల కలియుగ అనే మూవీ ప్రమోషన్‌ సాంగ్ లాంచ్‌లో పాల్గొన్న జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ”ఈ మధ్యకాలంలో సినిమాను ప్రమోట్ చేయడం కోసం పోస్టర్, టీజర్స్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నారు. […]

నాడు అలా.. నేడు ఇలా.. జీవిత 'డబుల్' రోల్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 10, 2019 | 2:15 PM

Share

నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఏదైనా పని ఒకరు చేస్తే ఒకలా.. అదే పని వేరే వాళ్లు చేస్తే ఇంకోలా మాట్లాడుతుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నటి జీవితా రాజశేఖర్‌పై కూడా ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇటీవల కలియుగ అనే మూవీ ప్రమోషన్‌ సాంగ్ లాంచ్‌లో పాల్గొన్న జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ”ఈ మధ్యకాలంలో సినిమాను ప్రమోట్ చేయడం కోసం పోస్టర్, టీజర్స్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నారు. నామీద.. నాకే” అసహ్యమేస్తోంది ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి కామెంట్ చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో ‘డిగ్రీ కాలేజ్’ చిత్ర ట్రైలర్ రిలీజ్‌ సమయంలోనూ ఆమె ఘాటుగా స్పందించారు.

”అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్100 పుణ్యమా అని.. లిప్‌లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడే చేయాలి. బట్టలు విప్పుకోవడం, సెక్స్ చేసుకోవడం, అమ్మాయి అబ్బాయి మీద ఎక్కడం, అబ్బాయి అమ్మాయి మీద ఎక్కడం ప్రతి సినిమాలో కామన్‌గా చూపిస్తున్నారు. ఇవి మీ జీవితంలో లేవా అని కొంతమంది వాదించొచ్చు. అవి అందరి జీవితంలో ఉన్నా.. అలాంటి పనులు రోడ్డు మీద చేయలేం కదా” అని ఘాటుగా స్పందించింది. అంతటితో ఆగకుండా ”నేను సెన్సార్ బోర్డ్ చీఫ్‌తో పాటు కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబర్‌ను. మీకు ఈ ట్రైలర్ సెన్సార్ కాలేదనుకుంటా” అంటూ అప్పట్లో ఆ సినిమాకు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలకు చాలా మంది మద్దతును ఇచ్చారు.

అయితే ఈ కామెంట్లు చేసిన కొద్ది రోజులకు జీవిత చిన్న కుమార్తె శివాత్మిక నటించిన ‘దొరసాని’ రిలీజ్ అయ్యింది. అందులో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాప్ సన్నివేశం ఉండగా.. దానిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. ”జీవిత గారు మీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారో ఒక్కసారి తవ్వుకుందాం.. ‘దొరసాని’ సినిమాలో లిప్ లాక్ ఉంది? అవి తప్పు అనే మీరు మీ కూతురు సినిమాలో లిప్ లాక్‌కి ఎలా ఒప్పకున్నారంటూ” ఆమె ఫైర్ అయ్యింది. అప్పుడు శ్రీరెడ్డికి చాలామంది మద్దతును తెలిపారు. ఇక ఇప్పుడు కూడా జీవిత ఇలానే కామెంట్లు చేయడంతో మళ్లీ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మీ విషయంలో ఒక విధంగా, ఇంకొకరి విషయంలో మరోలా స్పందించకండి అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు