పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. పవన్‌కు ఇది కంబ్యాక్ మూవీ కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాపై సరైన అప్డేట్స్ లేకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర విడుదలపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ సీజన్‌కు విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘వకీల్ సాబ్’కు తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..