Chiranjeevi: మెగాస్టార్‌ కోసం రంగంలోకి దిగనున్న బాలీవుడ్‌ కండల వీరుడు.. చిరుతో కలిసి స్టెప్పులు వేయనున్న..

|

Nov 15, 2021 | 12:12 PM

Chiranjeevi: చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు చిరంజీవి..

Chiranjeevi: మెగాస్టార్‌ కోసం రంగంలోకి దిగనున్న బాలీవుడ్‌ కండల వీరుడు.. చిరుతో కలిసి స్టెప్పులు వేయనున్న..
Chiranjeevi God Father
Follow us on

Chiranjeevi: చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో గాడ్‌ ఫాదర్‌ చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఆచార్య షూట్‌ చివరి దశకు చేరుకోవడంతో గాడ్‌ ఫాదర్‌ను శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి వస్తోన్న వార్తలే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ ఓ పాట పాడనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం చిత్ర యూనిట్‌ భారీగా ఖర్చు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం గాడ్‌ ఫాద్‌ చిత్రంలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ కలిసి అతిధి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో ఈ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నటించగా, తెలుగులో ఈ పాత్రను సల్మాన్‌ ఖాన్‌తో చేయించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. సినిమాలో ఈ క్యారెక్టర్‌ కొద్దిసేపే ఉన్నా కీలకంగా ఉంటుంది. ఈ విషయమై సల్మాన్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గాడ్‌ ఫాదర్‌ చిత్రాన్ని మేకర్స్‌ హిందీలో కూడా విడుదల చేయనున్నారా.? అందుకే ఈ పాత్ర కోసం సల్మాన్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారా.? అన్న విషయాలు.. అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఏది ఏమైనా వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Junior Nagarjuna: నవ మన్మథుడు కింగ్ నాగార్జునలా .. జూనియర్ నాగ్.. వీడియో వైరల్..

Etrance Neo e Scooter: హైదరాబాద్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే సిటీ అంతా రౌండ్ వేయొచ్చు! ధర ఎంతంటే..

Viral News: గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన పాడి రైతు.. సమస్యను పరిష్కరించిన పోలీసులు.. ఎలాగంటే..