ఇషా గుప్తా…బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ‘ఏక్ బార్…ఏక్ బార్’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో స్టెప్పులేసిన ఈ భామ సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తుంటుంది. తన ఫ్యాషనబుల్, గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా బాల్కానీలో సన్‌బాతింగ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో టాప్‌లెస్‌గా కనిపించి కుర్రకారు మతులను పోగొట్టింది. చాలామంది నెటిజన్లు ఆమె ఫొటోలపై పాజిటివ్‌గా స్పందించగా కొందరు మాత్రం అసభ్యకర కామెంట్లతో ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ ‘ కొన్నేళ్ల క్రితం వరకు సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ గురించి ఆలోచించి బాధపడేదాన్ని. అయితే ప్రస్తుతం అలాంటి ట్రోల్స్ గురించి పట్టించుకోవడం మానేశాను. వాటికి ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను’
ఒక చెంప మీద కొడితే నేను రెండుసార్లు కొడతాను!
‘నేను ఏ పని చేసినా కొందరు అదే పనిగా వేలెత్తి చూపిస్తున్నారు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా స్పందిస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు? ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపెడుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్ చేస్తే…’ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్ వేసుకో’ అని సలహాలిస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలో నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే..నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’ అని ఘాటుగా చెప్పుకొచ్చింది.
Also Read