Viral Video: లండన్ వీధుల్లో దుమ్మురేపిన హైదరాబాద్ కుర్రాళ్లు.. వీడియో చూస్తే గూస్ బంప్సే..

|

Aug 29, 2024 | 11:39 AM

ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో హైదరాబాదీ కుర్రాళ్ల డాన్స్. ఇంతకీ ఆ వీడియోలో స్పెషల్ ఏంటంటే.. లండన్ వీధుల్లో బుట్టో పాటకు డాన్స్ అదరగొట్టేశారు మన కుర్రాళ్లు. ప్రపంచంలో ఏమూలాన అయిన సరే తెలుగు ప్రజలు ప్రత్యేకంగా నిలుస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాదీ కుర్రాళ్లు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Viral Video: లండన్ వీధుల్లో దుమ్మురేపిన హైదరాబాద్ కుర్రాళ్లు.. వీడియో చూస్తే గూస్ బంప్సే..
Viral Video
Follow us on

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. అనేక రకాల వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డాన్స్ రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. చిన్న, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా సూపర్ హిట్ పాటలకు అందంగా స్టెప్పులేస్తుంటారు. కొన్ని వీడియోస్ నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని మాత్రం మనసుకు హత్తుకుంటాయి. కొన్ని వీడియోస్ మాత్రం అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో హైదరాబాదీ కుర్రాళ్ల డాన్స్. ఇంతకీ ఆ వీడియోలో స్పెషల్ ఏంటంటే.. లండన్ వీధుల్లో బుట్టో పాటకు డాన్స్ అదరగొట్టేశారు మన కుర్రాళ్లు. ప్రపంచంలో ఏమూలాన అయిన సరే తెలుగు ప్రజలు ప్రత్యేకంగా నిలుస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాదీ కుర్రాళ్లు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

లండన్ లో ఎప్పుడూ బిజీగా ఉండే వీధుల్లో ప్రముఖ బెనజీర్ భుట్టో పాట ‘దిలా తీర్ బిజా’కి హైదరాబాద్ కుర్రాళ్లు డాన్స్ అదరగొట్టేశారు. వీరితోపాటు విదేశీయులు సైతం జత కట్టడంతో ఆ వీడియో కన్నుల పండుగ ఉంది. భుట్టో పాటకు మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఈ సాంగ్ ఓల్డ్ సిటీ అబ్బాయిల కోసం అంటూ ఓ వ్యక్తి చెప్పడం వినవచ్చు. భుట్టో సాంగ్.. సాధారణంగా హైదరాబాద్ లో చాలా ఫేమస్. మ్యారెజ్ బరాత్, ఈవెంట్లలో ఎక్కువగా వినిపించే సాంగ్. హైదరాబాద్ కుర్రాళ్లతోపాటు విదేశీయులు కూడా డాన్స్ చేసి అలరించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ వీడియో చూస్తే నవ్వాగడం లేదు… ఇప్పటికీ వెయ్యిసార్లు చూశాను అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. హైదరాబాదీలు విదేశాల్లో తమ సంస్కృతిని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, ‘హైదరాబాదీ మార్ఫా’ బీట్‌లను కలిగి ఉన్న వీడియో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.