Spider-Man Movie: ఒకే సినిమాను 2.59 లక్షలు ఖర్చు పెట్టి.. 292 సార్లు చూసిన వ్యక్తి.. గిన్నిస్ బుక్ చోటు

|

Apr 19, 2022 | 10:23 AM

Spider-Man Movie: వీక్షకులకు వినోదాన్ని పంచే ఒక సాధనం సినిమా. అయిదు సినిమాను ఎవరైనా ఒకటి లేదా రెండు సార్లు చూస్తారు.. మరీ ఆ సినిమా చాలా చాలా బాగుంది. ఫేవరేట్ హీరో అయితే మరికొన్ని..

Spider-Man Movie: ఒకే సినిమాను 2.59 లక్షలు ఖర్చు పెట్టి.. 292 సార్లు చూసిన వ్యక్తి.. గిన్నిస్ బుక్ చోటు
Florida Man Watches Spider
Follow us on

Spider-Man Movie: వీక్షకులకు వినోదాన్ని పంచే ఒక సాధనం సినిమా. అయిదు సినిమాను ఎవరైనా ఒకటి లేదా రెండు సార్లు చూస్తారు.. మరీ ఆ సినిమా చాలా చాలా బాగుంది. ఫేవరేట్ హీరో అయితే మరికొన్ని సార్లు చూస్తాడేమో.. అలా మనదేశంలో హమ్ ఆప్ కె హై సినిమాను ఒక అభిమాని ఎక్కువ సార్లు చూసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. పదే పదే ఒకే సినిమాను ఎలా చూస్తారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు కూడా.. అయితే తాజాగా ఓ వ్యక్తి.. ఒక సినిమాను 20, 30 సార్లు కాదు… ఏకంగా వందల సార్లు చూసి రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా చూడడానికి లక్షలు ఖర్చు చేశాడు..నమ్మలేని నిజం ఇది.. మరి ఆ వ్యక్తిని అంతగా ఆకట్టుకున్న సినిమా ఏమిటి..? సినిమా పిచ్చి ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం..

అమెరికాలోని(America) ఫ్లోరిడాకు (Florida)చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి  3 నెలల్లో 292 సార్లు ఓ సినిమాను చూశాడు. దీంతో ఆ వ్యక్తి  “ఒకే సినిమాను అత్యధిక సార్లు థియేటర్ చూసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించి.. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లో చోటు దక్కించుకున్నాడు.  రామిరో అలనిస్  స్పైడర్ మ్యాన్.. నో వె హోమ్ (Spider-Man: No Way Home) అనే సినిమాను డిసెంబర్ 16 నుంచి మార్చి 15 మధ్య ఏకంగా 292సార్లు చూశాడు. ముఖ మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ ఆధారంగా తెరకెక్కిన సూపర్ హీరో మూవీని వీక్షించాడు. అతను ఈ సినిమాను చూడడం కోసం తన జీవితంలోని 720 గంటలు అంటే సుమారు 30రోజులు ఈ స్పైడర్ మ్యాన్ సినిమాకు కేటాయించాడు. ఇలా స్పైడర్ మ్యాన్ సినిమాను చూడడం కోసం టికెట్లకు సుమారు 3,400డాలర్లు మన దేశం కరెన్సీలో రూ.2.59లక్షలు ఖర్చు పెట్టాడు.

2021లో ఆర్నాడ్ క్లీన్ సృష్టించిన రికార్డ్ ను రామిరో అలనిస్ బద్దలు కొట్టాడు. ఆర్నాడ్ క్లీన్  Kaamelott: First Installmentని 204 సార్లు వీక్షించాడు. దీనిని బీట్ చేస్తూ ఇప్పుడు రామిరో అలనిస్ 292 సార్లు స్పైడర్ మ్యాన్ సినిమాను చూశాడు. ఇలా 292సార్లు ఒకే సినిమాను చూసినందుకు  రామిరో అలనిస్ కి గుర్తింపు లభించింది. ఒకే సినిమాను అనేక సార్లు చూసిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో అతడికి చోటు దక్కింది.

Also Read: Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన… మంత్రగత్తె అనే అనుమానంతో మహిళను వివస్త్రను చేసి ఉరేగింపు