Red Movie: రామ్ ‘రెడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు..

రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Red Movie: రామ్ 'రెడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు..


రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇందులో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‏బాస్టర్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చేస్తున్న రెడ్ మూవీపై అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల ట్రైలర్‏కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం.. మొదటి సారిగా రామ్ డబుల్ రోల్ నటిస్తుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనిని టీవీ9లో లైవ్‏లో వీక్షించగలరు.

Also Read:

Hero NTR: జూ.ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ‘చౌడప్పనాయుడు’గా రానున్న నందమూరి హీరో..

Alludu Adhurs pre release event: సంక్రాంతి పండుగకు అలరించబోతున్న “అల్లుడు అదుర్స్”.. ఘనంగా ప్రి రిలీజ్ ఈవెంట్