‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!

| Edited By:

Sep 04, 2020 | 5:44 PM

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ 4 పండుగ మరో రెండు రోజుల్లో(సెప్టెంబర్‌ 6) ప్రారంభం కానుంది

బిగ్‌బాస్ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!
Follow us on

Bigg Boss 4 Telugu: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ 4 పండుగ మరో రెండు రోజుల్లో(సెప్టెంబర్‌ 6) ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన షూటింగ్‌ని రేపు(శనివారం) చేసేందుకు టీమ్‌ సిద్ధమైంది. అయితే ఈ లోపే బిగ్‌బాస్‌ నిర్వాహకులకు మరో కంటెస్టెంట్‌ షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ నుంచి బుల్లితెర హీరోయిన్, ముద్దమందారం ఫేమ్ తనూజ పుట్టస్వామి ఔట్ అయినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఇబ్బందుల వలన ఈ సీజన్ నుంచి ఆమె బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిర్వాహకులు చివరి నిమిషంలో తలపట్టుకున్నారని టాక్‌.

కాగా ఈ సీజన్‌లో పలువురు టీవీ నటులు, దర్శకులు, సహాయ నటులు, యూట్యూబర్లను భాగం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేసి రెడీగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో తనూజ, నిర్వాహకులకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారంలోనే రఘు మాస్టర్ సైతం బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్‌. ఇక మరో ముగ్గురికి కరోనా సోకిందని కూడా సమాచారం. మరి ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? కరోనా నేపథ్యంలో ఈ సీజన్ ఎలా ఉండబోతోంది..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Read More:

కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ ఫోర్జరీ.. డాక్టర్‌ అరెస్ట్‌

శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్