ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.. ? ఆ పేరు వింటేనే ఆడియన్స్ కు పూనకాలు

|

Oct 07, 2024 | 2:17 PM

విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్. ఇటీవలే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.. ? ఆ పేరు వింటేనే ఆడియన్స్ కు పూనకాలు
Tollywood
Follow us on

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. తన నటనతో యూనివర్సల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలడు కమల్ హాసన్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు ఈ లోకనాయకుడు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్. ఇటీవలే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించరు. ఇక కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో స్వాతిముత్యం సినిమా ఒకటి. కల్ట్ క్లాసిక్ హిట్ ఈ సినిమా..

కళాతపస్వీ కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతం  స్వాతిముత్యం. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయక యువకుడి పాత్రలో కనిపించాడు. మతిస్థిమితం సరిగ్గా లేని వాడి పాత్రలో అద్భుతంగా నటించారు కమల్. అలాగే ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన కుర్రాడిని గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో తెలుసా.? అంతని పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆ కుర్రాడు మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

అల్లు అర్జున్ స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. అతని పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఈ సినిమాలో.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.