AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhuri Rathod : యూట్యూబ్ సెన్సేషన్.. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతో తెలుసా.. ?

సినీరంగంలో ఫేమ్ రావడం అంత సులభమైన విషయం కాదు. సక్సెస్ రావడం వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది. విమర్శలు, అవమానాలు, నిద్రలేని రాత్రులు, తిండి లేకుండా పరిగెత్తిన రోజులు ఉంటాయి. కానీ అన్నింటిని దాటుకుని విజయం సాధించిన వారి గురించి చెప్పక్కర్లేదు. కానీ చిన్న తప్పుతో ఆ పాపులారిటీని, కెరీర్ నాశనం చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ జీవితం కూడా అలాగే మారింది.

Madhuri Rathod : యూట్యూబ్ సెన్సేషన్.. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతో తెలుసా.. ?
Madhuri Rathod
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2026 | 5:39 PM

Share

ఇటీవల తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. బాసింగ బలాలు, ప్రమీల, రాతిరి రాతిరిలో, సన్న సన్న బియ్యమే మదనో నా వయ్యారి వంటి పాటలు కోట్లలో వ్యూస్ అందుకుంటూ సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఈ పాటలలో ప్రధాన పాత్రలు పోషించిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ సైతం జనాలను కట్టిపడేశాయి. దీంతో వీరిద్దరు నెట్టింట ఫోక్ డ్యాన్సర్స్ గా చాలా ఫేమస్ అయ్యారు. కానీ ఈ ఇద్దరి సంవత్సరాల శ్రమ ఒక చిన్న వివాదంలో చిక్కుల్లో పడింది. ఇప్పుడు వీరిద్దరు ఒక వివాదంతో ఇటీవల వార్తల్లో నిలిచారు. ఇదివరకే పెళ్లై బాబు ఉన్న ఈశ్వర సాయితో మాధురి ఓ హోటల్లో అతడి భార్యకు అడ్డంగా దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింటిని ఊపేస్తున్నాయి. అయితే ఈశ్వర సాయి భార్య చేసిన కామెంట్స్ పై ఇప్పుడు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మాధురికి మద్దతు ఇస్తూ ఈశ్వర సాయిని ఏకిపారేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి కాంట్రవర్సీ వైరల్ అవుతుండగా.. నెటిజన్లతో పాటు అభిమానులు కూడా మాధురి రాథోడ్ వ్యక్తిగత విషయాలపై, ముఖ్యంగా ఆమె ఆదాయంపై దృష్టి సారించారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంత సంపాదిస్తుందనే దానిపై పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెట్టింట వైరలవుతున్న టాక్ ప్రకారం మాధురి రాథోడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నెలకు భారీగానే సంపాదిస్తున్నారు.. ఫోక్ సాంగ్స్, యూట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ ప్రమోషన్లు, పెయిడ్ కొలాబరేషన్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆమె నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సరైన క్లారిటీ లేదు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

కేవలం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాధురి రాథోడ్, ఒక వివాదంలో ఇప్పుడు వార్తలలో నిలిచారు.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Follow Us