WPL 2024: లాస్ట్ బాల్ సిక్స్‌తో ముంబైని గెలిపించిన ఈ ప్లేయర్ ఓ నటి కూడా.. ఏ సినిమాలో నటించిందంటే?

|

Feb 26, 2024 | 4:46 PM

డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ముంబై గెలవాలంటే.. లాస్ట్ బాల్‌కి ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. ఆ జట్టు బ్యాటర్ సజనా సజీవన్.. అద్భుతమైన సిక్స్ కొట్టి అపూర్వ విజయాన్ని అందించింది. ఒకే ఒక్క బంతికి ధోని లెక్క సిక్స్ కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది సజనా సజీవన్. ఇక ఆమె గురించి ఓ ఆసక్తికర వార్త..

WPL 2024: లాస్ట్ బాల్ సిక్స్‌తో ముంబైని గెలిపించిన ఈ ప్లేయర్ ఓ నటి కూడా.. ఏ సినిమాలో నటించిందంటే?
Mi Vs Dc
Follow us on

డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ముంబై గెలవాలంటే.. లాస్ట్ బాల్‌కి ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. ఆ జట్టు బ్యాటర్ సజనా సజీవన్.. అద్భుతమైన సిక్స్ కొట్టి అపూర్వ విజయాన్ని అందించింది. ఒకే ఒక్క బంతికి ధోని లెక్క సిక్స్ కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది సజనా సజీవన్. ఇక ఆమె గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  సజనా సజీవన్‌ను ఈ సీజన్ వేలంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 15 లక్షలకు కొనుగోలు చేసింది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన సజనా.. డబ్ల్యూపీఎల్ సెకండ్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా లేడీ ధోనిగా పేరు సంపాదించింది. తండ్రి రిక్షావాలా అయినప్పటికీ.. తన కలను సాకారం చేసుకునేందుకు రేయింబవళ్ళు కష్టపడింది సజనా సజీవన్. ఇదిలా ఉంటే.. సజనా ఓ తెలుగు సినిమాలో నటించిన సంగతి మీకు తెల్సా.?

శివ కార్తికేయన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాలో సజనా సజీవన్ ఓ పాత్రలో కనిపించింది. 11 మండి లేడీ క్రికెటర్లలో ఆమె కూడా ఓ ప్లేయర్‌గా కనిపించింది. కాగా, డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి.. లాస్ట్ బంతికి ఐదు పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో సజనా లేడీ ధోనిలా చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించింది.

ఇది చదవండి: ఆ యువ ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే.! బీసీసీఐ వార్నింగ్ సిగ్నల్స్.. కాపాడటానికి ధోని కూడా లేడుగా.!

ఇది చదవండి: టీమిండియా విజయంలో ఆ ముగ్గురే కీలకం.. వారు లేకుంటే ‘బజ్ బాల్’ ముందు అధోగతి..