AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..

భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ సినిమా నిరాశే మిగిల్చింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ మూవీపై మొదటి నుంచి మంచి హైప్ ఉండగా.. థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగా హీరో యశ్ ఓ భారీ ప్రాజెక్టును వదులుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వెల్లడించారు.

Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..
Toxic Movie Yash
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2026 | 11:35 AM

Share

కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు యశ్. ఈ రెండు సినిమాల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇందులో భారీ తారాగణం నటించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం యశ్ మరో భారీ ప్రాజెక్టు వదులుకున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ పీఎస్ మిత్రన్ వెల్లడించారు. ఆయన తెరకెక్కించిన సర్దార్ 2 సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్న మిత్రన్ తన సినీ ప్రయాణం గురించి.. యశ్ తో సినిమా మిస్ కావడం గురించి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

దర్శకుడు పీఎస్ మిత్రన్ సూపర్ స్టార్ యష్‌తో కలిసి సినిమా చేయాలనే ప్రణాళికలు ప్రస్తుతం వాయిదా పడ్డాయని వెల్లడించారు. మిత్రన్ యష్ కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు, ఆ కథ యష్‌కి బాగా నచ్చిందని కూడా ఆయన తెలిపారు. అయితే, యష్ తన భారీ ప్రాజెక్ట్ టాక్సిక్ మూవీలో నిమగ్నమై ఉండటంతో, మిత్రన్‌తో చేయాల్సిన సినిమా ఆలస్యం అయ్యిందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

2023 ఫిబ్రవరిలోనే యష్ టాక్సిక్ సినిమాకు తన కమిట్‌మెంట్ ఇచ్చారని మిత్రన్ పేర్కొన్నారు. దీంతో, ఆయన టాక్సిక్ షూటింగ్ పూర్తయిన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచించే అవకాశం ఉంది. యష్ హీరోగా ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ స్టోరీని సిద్ధం చేసుకున్నానని అన్నారు. అది నత డ్రీమ్ ప్రాజెక్ట్ అని డైరెక్టర్ మిత్రన్ తెలిపారు. “కథ యష్‌కి నచ్చింది, కానీ టైమ్‌లైన్స్ వల్ల కొంచెం ఆలస్యమవుతుంది. టాక్సిక్ పూర్తయ్యాక ప్రారంభిద్దాం” అని మిత్రన్ పేర్కొన్నారు. యష్ తన ప్రతి ప్రాజెక్ట్‌కు పూర్తి సమయాన్ని కేటాయిస్తారని, టాక్సిక్ సినిమా పూర్తైన తర్వాతే మిత్రన్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని సినీ వర్గాల సమాచారం. కన్నడ, తమిళ చిత్రసీమలలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి వంటి ఇతర తారలతో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని మిత్రన్ ప్రస్తావించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us