Tollywood: యాడ్నో చూసినట్టు ఉంది కదా.! మన యాంకరమ్మే.. అప్పుడలా.. ఇప్పుడేమో ధగ.. ధగ

|

Feb 11, 2023 | 5:08 PM

తెలుగులో ప్రస్తుతం లేడీ యాంకర్స్‌ హవా నడుస్తోంది. ఈ తరం యాంకరమ్మలు హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. ముఖ్యంగా తమ అందంతో మెస్మైరైజ్‌ చేస్తున్నారు. నిండు చీరకట్టులోనే కాదు, పొట్టి పొట్టి డ్రస్సుల్లోనూ దర్శనమిస్తూ కుర్రకారు...

Tollywood: యాడ్నో చూసినట్టు ఉంది కదా.! మన యాంకరమ్మే.. అప్పుడలా.. ఇప్పుడేమో ధగ.. ధగ
Guess The Celebrity
Follow us on

తెలుగులో ప్రస్తుతం లేడీ యాంకర్స్‌ హవా నడుస్తోంది. ఈ తరం యాంకరమ్మలు హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. ముఖ్యంగా తమ అందంతో మెస్మైరైజ్‌ చేస్తున్నారు. నిండు చీరకట్టులోనే కాదు, పొట్టి పొట్టి డ్రస్సుల్లోనూ దర్శనమిస్తూ కుర్రకారు మతులను పోగొడుతున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. లక్షల మంది ఫాలోవర్లతో సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్నారు.

పైన ఫొటోలో కనిపిస్తోన్న యాంకరమ్మ కూడా ఇలాంటి జాబితాలోకి వస్తుంది. అత్యంత తక్కువ స్థాయి నుంచి కెరీర్‌ను మొదలు పెట్టి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో క్రేజీగా మారిందీ బ్యూటీ. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో చిన్న యాంకర్‌గా తళుకున్నమన్న ఈ అందాల యాంకర్‌ బిగ్‌బాస్‌లో చోటు దక్కించుకుంది. హౌజ్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందాల విందు చేస్తోంది. నిత్యం సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను అందంతో కట్టిపడేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఈ అందాల యాంకర్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడు మరెవరో కాదు, స్రవంతి చొక్కారపు. పుష్ప సినిమా టైమ్‌లో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన స్రవంతి. జెట్‌ వేగంతో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందాల ఆరబోతతో కుర్రకారును బేజారు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీచ్‌ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసింది స్రవంతి. ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి సోషల్‌ మీడియా ద్వారా వస్తున్న క్రేజ్‌ స్రవంతి కెరీర్‌కు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..