Shilpa Shetty: భర్త రాజ్ కుంద్ర కంపెనీకి శిల్పా శెట్టి రాజీనామా.. డైరెక్టర్ పదవికి రిజైన్ చేసిన బాలీవుడ్ నటి

Shilpa shetty: అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్నారంటూ ప్రముఖ రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుంద్రాను విచారించడం కోసం పోలీసులు కస్టడీ కోరగా...

Shilpa Shetty: భర్త రాజ్ కుంద్ర కంపెనీకి శిల్పా శెట్టి రాజీనామా.. డైరెక్టర్ పదవికి రిజైన్ చేసిన బాలీవుడ్ నటి
Raj Kundra

Edited By:

Updated on: Jul 24, 2021 | 5:52 PM

Shilpa shetty: అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్నారంటూ ప్రముఖ రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుంద్రాను విచారించడం కోసం పోలీసులు కస్టడీ కోరగా.. ముంబై కోర్టు రాజ్ కుంద్రా కస్టడీని కోర్టు జూలై 27 వరకు పొడిగించింది. ఈ కేసు దర్యాప్తుని పోలీస్ బృందం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శిల్ప శెట్టి , రాజ్‌కు చెందిన జుహు అపార్ట్‌మెంట్‌ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసే సమయంలో క్రైమ్ బ్రాంచ్ అపార్ట్మెంట్ కు రాజ్ కుంద్రాను తీసుకువెళ్ళినట్లు సమాచారం.

తాజాగా శిల్పా శెట్టి వియాన్ ఇండస్ట్రీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. శిల్పా ని  ఈ కేసు విషయంలో విచారిస్తున్న నేపథ్యంలో శిల్పా తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిందని అంటున్నారు. రాజ్ కుంద్రా తన సంపాదనను ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టినట్లు ఇతర వర్గాలు ఆరోపిస్తున్నాయి.. పోలీసులు ఈ కోణంలో కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రా అకౌంట్ నుంచి బెట్టింగ్ లకు భర్తీ నగదు బదిలీ అయినల్టు గుర్తించారు.

ఇక మరోవైపు రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి కి కూడా ఈ సెక్స్ రాకెట్ గురించి తెలుసా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయస్తున్నారు. శిల్పా శెట్టి బ్యాంక్ ఖాతా వివరాలను , ట్రాన్సక్షన్స్ ను క్రైమ్ బ్రాంచ్ క్రాస్ చెక్ చేస్తుంది. ఇప్పటికే రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ విషయంలో పలు కేసులు ఎదుర్కొంటున్నారు.

Also Read:

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు..5 గంటల పాటు ‘విచారణ’

Loading...
Unable to load recommendations.
Follow Us