Sharukh Khan: దీపికా దుస్తులపై పెద్ద ఎత్తున విమర్శలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్..

|

Dec 16, 2022 | 12:26 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన పఠాన్ సినిమాకు కూడా బైకాట్ సెగ తగులుతుంది. ఈ మూవీని బైకాట్ చేయాలంటూ ఇప్ప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

Sharukh Khan: దీపికా దుస్తులపై పెద్ద ఎత్తున విమర్శలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్..
Sharukh Khan
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీని బైకాట్ సెగ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బీటౌన్ పూర్తిగా నష్టాలను చవిచూస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించే స్టార్ హీరోస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందుతున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ నటించిన పెద్ద ప్రాజెక్ట్స్ డిజాస్టర్లుగా మిలిగిలాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన పఠాన్ సినిమాకు కూడా బైకాట్ సెగ తగులుతుంది. ఈ మూవీని బైకాట్ చేయాలంటూ ఇప్ప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. షారుఖ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ మూవీ నుంచి విడుదలైన బేషరమ్ రంగ్ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేసింది చిత్రాయూనిట్. అయితే ఇందులో దీపికా ధరించిన దుస్తులు.. ఆమె కనిపించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు సైతం దీపికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోల్ కతా వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో షారుఖ్ ఈ వివాదంపై స్పందించారు.

ప్రేక్షకులు.. అభిమానులు తమను ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది.. ? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే.. షారుఖ్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియా కొన్నిసార్లు సంకుచిత దృష్టికోణంతో చూస్తూ ఉంటుంది. కొంతమంది ప్రవర్తన అంతే. సోషల్ మీడియా వినియోగం వల్ల నెగెటివిటీ పెరుగుతుందని ఎక్కడో చదివాను. అలాంటి పనులు మనుషుల మధ్య విభేదాలను సృష్టించి.. నాశనం చేస్తాయి. కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటివి సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి సందర్భంలో సినిమా మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని నేను అనుకుంటున్నాను. సినిమా సజీవమైన కథలను.. సహజంగా ప్రజల ముందుకు తీసుకువస్తుంది. దీని ద్వారా ఒకరినొకరు మరింత తెలుసుకునేలా చేస్తుంది. కరుణ, ఐక్యత, సోదరత్వం అనేవి.. మానవత్వం అపారమైన సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.