Kangana Ranaut: ‘లవ్ ఫెయిల్యూర్ జరగడం మంచికే.. ఆలస్యంగా అర్థమైంది..’ కంగనా రనౌత్ ఆసక్తికర కామెంట్స్..

|

Oct 29, 2023 | 8:11 AM

ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోన్న చిత్రం తేజస్. ఇందులో పైలెట్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రేమ విజయం కంటే.. ఫెయిల్యూర్ బాగుంటుందని.. ఎన్నో విషయాలు తెలుసుకుంటారని.. బ్రేకప్ జరగడం మంచికే అని చాలా మంది ఆలస్యంగా తెలుసుకుంటారంటూ చెప్పుకొచ్చింది.

Kangana Ranaut: లవ్ ఫెయిల్యూర్ జరగడం మంచికే.. ఆలస్యంగా అర్థమైంది.. కంగనా రనౌత్ ఆసక్తికర కామెంట్స్..
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్ అంటే కంగనా రనౌత్ అనే చెప్పాలి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటారు. ఇక చాలాసార్లు ఇండస్ట్రీలో నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల గురించి కాకుండా.. ఎక్కువగా ఇతర వివాదాస్పద విషయాలతోనే నిత్యం వార్తలలో నిలిచేవారు. ఇటీవల చంద్రముఖి 2 చిత్రంలో నటించింది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోన్న చిత్రం తేజస్. ఇందులో పైలెట్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రేమ విజయం కంటే.. ఫెయిల్యూర్ బాగుంటుందని.. ఎన్నో విషయాలు తెలుసుకుంటారని.. బ్రేకప్ జరగడం మంచికే అని చాలా మంది ఆలస్యంగా తెలుసుకుంటారంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.

తేజస్ సినిమా ప్రమోషనల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కంగనా మాట్లాడుతూ.. “తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డాను.. కానీ కొన్ని కారణాలతో అది బ్రేకప్ అయ్యింది. మేం అలా ఎందుకు విడిపోయామని చాలా కాలం ఎంతో బాధపడ్డాను. కానీ ఆ తర్వాత అర్థమైంది.. విడిపోయి మంచి పని చేసానని. ప్రేమలో ఉంటే అవే ఆలోచనలతో అక్కడే ఉండిపోయేదాన్ని. ప్రేమలో ఉంటే సమయం దానికే సరిపోతుంది. మరో ఆలోచన లేకుండా చేస్తుంది. కానీ అదృష్టంతో నేను బయటపడ్డాను. ఫెయిల్యూర్ వల్ల లాభాలంటే అందులో ఫెయిలైన వారికే తెలుస్తోంది. ఇది కేవలం ప్రేమ గురించి కాదు. ఇలా చెబుతున్నానని పెళ్లి చేసుకోనని కాదు.. అందరిలాగా నాకు పెళ్లి చేసుకుని ఓ కుటుంబం ఏర్పర్చుకోవాలని ఉంది. కుటుంబానికి ఎంతో గౌరవాన్ని ఇస్తాను. ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటా. అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి కావాలి. వాళ్లే వరుడిని వెతకాలి. వారు చూసిన అబ్బాయిని పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాను.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. చాలా కాలంగా కంగనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. ఇప్పటికే హిందీలో ఎన్నో సినిమాలు నిరాశ పరిచాయి. ఇక ఇటీవల ఆమె నటించిన చంద్రముఖి 2 సైతం నిరాశ పరిచింది. ఇప్పుడు కంగానా ఆశలన్నీ తేజస్ సినిమాపైనే ఉన్నాయి. మరీ ఈ మూవీ కంగానా కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.