Isha koppikar: అతన్ని ఒంటరిగా కలవలేదని సినిమా ఛాన్స్‌ కోల్పోయా.. బాంబ్‌ పేల్చిన బాలీవుడ్ బ్యూటీ..

|

Sep 20, 2022 | 10:15 AM

Isha koppikar: క్యాస్టింగ్ కౌచ్ అంశం సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాంప్రమైస్‌ అవ్వాల్సిందే అంటూ హీరోయిన్లు బహిరంగంగా చేస్తోన్న వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలను షేక్‌ చేస్తున్నాయి...

Isha koppikar: అతన్ని ఒంటరిగా కలవలేదని సినిమా ఛాన్స్‌ కోల్పోయా.. బాంబ్‌ పేల్చిన బాలీవుడ్ బ్యూటీ..
Isha Koppikar
Follow us on

Isha koppikar: క్యాస్టింగ్ కౌచ్ అంశం సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాంప్రమైస్‌ అవ్వాల్సిందే అంటూ హీరోయిన్లు బహిరంగంగా చేస్తోన్న వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలను షేక్‌ చేస్తున్నాయి. హాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు నటీమణులు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమతో అభ్యంతకరంగా ఎవరు వ్యవహరించారనే విషయం చెప్పకుండనే నటీమణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి మొన్న టాలీవుడ్ యాంకర్‌ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ చర్చ ఇంకా ముగియకముందే తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ఇచ్చిన స్టేట్‌మెంట్ మరోసారి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ అంశం తెరపైకి వచ్చింది.

బాలీవుడ్‌కు చెందిన ఇషా కొప్పికర్‌ తన తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనను పంచుకుంది. ఒక సమయంలో వయసులో తనకంటే చాలా పెద్దవాడైన ఓ ప్రముఖ నిర్మాత, నటుడు తనను ఒంటరిగా కలవాలని ఇబ్బంది పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే తాను సదరు నిర్మాత దగ్గరికి తన వ్యక్తిగత సిబ్బందితో వెళ్లానని.. దాంతో తనను కలవడానికి నిరాకకరించాడని తెలిపింది. అంతటితో ఆగని ఆ నిర్మాత కమ్‌ యాక్టర్‌ తాను చెప్పినట్లు ఒంటరిగా కలవకపోవడంతో వెంటనే సినిమా నుంచి తొలగించాడని చెప్పుకొచ్చింది. ఈ సంఘటన మన మనసును ముక్కలు చేసిందన్న ఇషా.. ఇండస్ట్రీలో అందంగా ఉండడం ఎంత ముఖ్యమో, హీరోల జాబితాలో చేరడం అంతే ముఖ్యమని ఆ క్షణంలో అర్థమైనట్లు తెలిపింది. ఇక జీవితంలో వృత్తికంటే నిజాయితీగా బతకడమే గొప్పగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఈషా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. చంద్రలేఖ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార అనంతరం ప్రేమతో రా సినిమాలో కనిపించింది. ఇక చివరగా నిఖిల్‌ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..