బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలలో అనుష్క శర్మ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ మంచి పేరు సంపాదించుకోవాలనే తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2007లో ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ ద్వారా మొదటిసారి మోడలింగ్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో రబ్ నే బనా ది జోడి సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది అనుష్క. మొదటి సినిమాతోనే నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 2012లో బాలీవుడ్ బాద్ షా జోడిగా జబ్ తక్ హై జాన్ సినిమాలో నటించింది. హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది.
2017లో డిసెంబర్ 11న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది. వీరికి వామిక జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది అనుష్క. ఇటీవల కొద్ది రోజులుగా ఆమె రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అనుష్క ఫస్ట్ ఆడిషన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో అనుష్క లుక్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో అనుష్క.. తన ఫస్ట్ ఆడిషన్లో ఎంతో ధైర్యంగా.. ఎలాంటి బెరుకు లేకుండా డైలాగ్స్ చెప్పడం చూసి ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.
కెరీర్ ప్రారంభంలోనే ఆమె సామర్థ్యం పట్ల నమ్మకం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను అనుష్క అభిమానులు షేర్ చేస్తూ అనుష్క అసాధారణమైన నటనా నైపుణ్యం ఆమెను అగ్ర కథానాయికగా మార్చిందంటూ ప్రశంసిస్తున్నారు. ఆడిషన్ టేప్‌లో అనుష్క తన పాత్రకు అప్రయత్నంగా జీవం పోసిన విధానం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో అనుష్క తన వయసు 18 అని చెప్పడం.. ఎంతో అమాయకంగా, అందంగా కనిపిస్తుంది. అనుష్క తన క్రాఫ్ట్‌లో స్థిరంగా ఉంచిన కృషి, అంకితభావానికి ఈ వీడియో నిదర్శనం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.