బుల్లితెరపై ఎన్నో సీరియల్లలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ తర్వాత సూపర్ 30 అనే సినిమాతో వెండితెరపై హీరోయిన్గా కనిపించి సూపర్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే హీరోయిన్గా సక్సెస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ జెర్సీ సినిమాలో నటిస్తోంది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రానికి హిందీ రిమేక్ ఇది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
మృణాల్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నానని తెలిపింది. అలాగే తనకు ఏడు నెలల క్రితం తన బ్రేకప్ జరిగిందని.. తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని తెలిపింది. పద్దతులు.. కట్టుబాట్లను ఎక్కువగా ఫాలో అవుతాడని.. తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పింది. అయితే తాను నటినని.. సినిమాల్లో నటిస్తానని తెలిసిన తర్వాత తనను విడిచిపెట్టి పారిపోయినట్లు చెప్పుకొచ్చింది. తనను విడిచి వెళ్లిపోయిన అతనిపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇప్పుడు సర్దిచెప్పుకుని పెళ్లి చేసుకున్న ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్పవని తెలిపింది. తమకు పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత.. వారిని పెంచే క్రమంలో గొడవలు రావొచ్చని.. అందుకే తన బ్రేకప్ గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని తెలిపింది. అలాగే తన కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..
Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..