Viral Photo: కలువ కళ్ల చిన్నది.. చూపులతో కట్టిపడేసే కుర్రది.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నెగ్గుకురావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మొదటి సినిమాతోనే..

Viral Photo: కలువ కళ్ల చిన్నది.. చూపులతో కట్టిపడేసే కుర్రది.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!
Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 22, 2022 | 6:02 PM

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నెగ్గుకురావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లుగా, ఎంతోమంది ఫ్యాన్స్‌కు దగ్గరైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఈ కోవలోనే తమిళంలో చేసిన మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఓ హీరోయిన్. ఆ సినిమాతో అటు తమిళ తంబీలకు.. ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరి ఆమెవరో కనిపెట్టండి చూద్దాం.!

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చేసింది ఒకటే సినిమా. అది కూడా తమిళంలో.. ఆ సినిమా అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో రిలీజైంది. ఇంకేముంది ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆమెవరో కనిపెట్టారా.? ఇంకా లేదా.. అయితే మీకో క్లూ.. ఆమె పేరు.. అలనాటి అందాల హీరోయిన్ పేరు ఒకటే. ఇక తమిళంలో ఆమె చేసిన సినిమాలో హీరోగా జీవీ ప్రకాష్ కుమార్ నటించాడు. కనిపెట్టలేకపోయారా.! అయితే మేమే చెప్పేస్తాం.. ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్య భారతి.

తమిళంలో ‘బ్యాచలర్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివ్య భారతి.. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. జీ5 ఓటీటీలో రిలీజైన ‘బ్యాచలర్’ మూవీ ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ దివ్య భారతికి వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్.