AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలోనే గుర్తుండిపోయే ఙ్ఞాపకం..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.

కేవలం సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలోనే గుర్తుండిపోయే ఙ్ఞాపకం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 4:30 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. ఇక రెండో భాగం వచ్చి ఈ రోజుకు మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. నా జీవితంలో అతిపెద్ద సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర ఙ్ఞాపకమని ప్రభాస్ పేర్కొన్నారు.

”దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడిన బాహుబలి 2 కేవలం చిత్రమే కాదు.. నా జీవితంలో అతిపెద్ద సినిమా. నాకు గుర్తుండిపోయే ఙ్ఞాపకాన్ని ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, టీమ్‌, నా అభిమానులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. బాహుబలి 3 ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమలకు కృతఙ్ఞుడిని” అని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలి షూటింగ్ సమయంలో రానా, రాజమౌళితో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేశారు.

కాగా బాహుబలిలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

Read This Story Also: తెలుగు సినిమాకు ఓకే చెప్పిన సిద్ధార్థ్.. ఆ హీరోతో మల్టీస్టారర్..!

https://www.instagram.com/p/B_g7ioAHRPr/?utm_source=ig_embed

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత