Theaters In AP: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో వందశాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు..

|

Oct 13, 2021 | 7:28 PM

Theaters In AP: ఏపీ ప్రభుత్వం మూవీ లవర్స్‌తో పాటు, థియేటర్ల ఓనర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని..

Theaters In AP: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో వందశాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు..
Ap Theaters
Follow us on

Theaters In AP: ఏపీ ప్రభుత్వం మూవీ లవర్స్‌తో పాటు, థియేటర్ల ఓనర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రకటన జారీచేసింది. వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం రేపటి నుంచే (గురువారం) అందుబాటులోకి రానుంది.

కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల థియేటర్‌ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదల కానున్న మహా సముద్రంతో పాటు, దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, పెళ్లి సందడి సినిమాలకు ఇది ఎంతగానో మేలు చేయనున్నట్లు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటికీ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం వాటిపై కూడా ఆంక్షలను కుదించింది. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో సెకండ్‌ షో సినిమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునే అవకాశం లభించింది. వంద శాతం ఆక్యూపెన్సీతో నాలుగు షోలు ఆడడం ఇటు నిర్మాతలతో పాటు పండుగ సీజన్‌లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారికి శుభ వార్తే అని చెప్పాలి.

Also Read: MS Dhoni: కొత్త పాత్రలో ఎంఎస్ ధోని.. క్రికెట్ అకాడమీ మొదలెట్టిన భారత మాజీ కెప్టెన్.. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Virat Kohli Biopic: విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుందిః అఖిల్ అక్కినేని

పూణే – ముంబైల మధ్య ఇంటర్ సిటీ కోచ్ ఈవీ ట్రాన్స్ బస్సులు.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన MEIL గ్రూప్