ఆ సినిమా చేయొద్దని అందరూ హెచ్చరించారు.. కట్ చేస్తే.. రూ.13 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..
టాలీవుడ్ కామెడీ కింగ్.. హీరో అల్లరి నరేష్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సీరియస్ రోల్స్ ఎంపిక చేసుకుంటున్న ఈ హీరో.. ఒకప్పుడు మాత్రం వరుసగా కామెడీచ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ తాను నటించిన ఓ చిత్రంపై వచ్చిన వ్యతిరేక సలహాలు, సందేహాలను పక్కనబెట్టి, తన అచంచలమైన నమ్మకంతోనే ఆ సినిమా భారీ విజయం సాధించిందని ఇటీవల వెల్లడించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో హాస్య నటనతో ప్రేక్షకులను అలరించి ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్. ప్రస్తుతం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘కితాకితలు’ సినిమా వెనుక ఉన్న ఒక విశేష సంఘటనను ఇటీవల గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ గారు ‘కితకితలు’ చిత్రంలో గీతా సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసిన సమయంలో పరిశ్రమలోనూ, బయట అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఒక లావుగా ఉండే అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయడం చాలా పెద్ద రిస్క్ అని, ఆ కథను మార్చుకోవాలని లేదా వేరే కథానాయికను ఎంపిక చేసుకోవాలని నరేష్‌కి చాలామంది ఫోన్ చేసి సలహాలు ఇచ్చారంట. పైగా ఆ సినిమాలో సాధారణమైన డ్యూయెట్ పాటలు లేకపోవడం కూడా ఒక పెద్ద రిస్క్‌గా భావించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
అయితే, నరేష్‌కి తన తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ గారి ప్రతిభపై, అలాగే ఆ కథ , పాత్రల రూపకల్పనపై పూర్తి నమ్మకం ఉంది. “నాన్నగారు ఒక కథను అనుకున్నారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుంది. ఆ కథపై నాకు 100% నమ్మకం ఉంది” అని భావించిన నరేష్, అందరి హెచ్చరికలను పక్కనపెట్టి ఆ సినిమాను పూర్తి చేశారు. అప్పట్లో అత్యంత పరిమిత బడ్జెట్‌తో, కేవలం రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొంది, ఏకంగా రూ.12 కోట్ల నుండి రూ.13 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
ఎవరైతే ఆ సినిమా చేయవద్దని సలహా ఇచ్చారో, వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘కితకితలు’ చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. సరైన కథ, పాత్రల ఎంపికపై నమ్మకం ఉంటే బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించవచ్చని ఈ చిత్రం నిరూపించింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
